సినీనటులను తమ అభిమానులు ముద్దుగా బిరుదులతో పిలుచుకోవడం మామూలే. ఈ సంస్కృతి ఎన్టీఆర్ ఎన్నార్ కాలం నుంచీ వస్తోంది. ఎన్టీఆర్ నటరత్న అయితే.. ఏఎన్నార్ నటసామ్రాట్ అయ్యారు. కైకాల సత్యనారాయణకు  నవరసనటనాసార్వభామ అని.. ఇలా పలువురికి బిరుదులున్నాయి.

ఐతే.. ఆ బిరుదులన్నీ వారి నటనతో సంపాదించుకున్నవేనని.. ఇప్పుడొచ్చే కుర్రాళ్లకు ముందూవెనుకా చూడకుండా బిరుదులిస్తున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విమర్శలు గుప్పించాడు. అందుకు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చాడు.

చెప్పుకోవడానికి ఒక్క హిట్‌ కూడా లేని నాగ చైతన్యకు ‘యువ సామ్రాట్‌’ అనే బిరుదు ఎందుకిచ్చారో తెలియదని...  జూనియర్‌ ఎన్టీఆర్‌ను ‘యంగ్‌ టైగర్‌’  ఎందుకంటారని.. ఆయన ప్రశ్నించారు.  టైగర్‌ అంటే  ఏమిటి? ఆయన ఎవరిని తింటారు.. అని ప్రశ్నించారు. 

కుర్రాళ్లనే కాదు.. రాధాకృష్ణ సీనియర్ నటులనూ ఆడుకున్నారు. నాగార్జునకు ‘కింగ్‌’ అని బిరుదిచ్చారు.. ఆయన ఎవరికి కింగ్‌ ? అని ప్రశ్నించారు. పరాజయాలు కూడా చవిచూసిన వెంకటేష్‌కు అపజయమే లేనట్టుగా ‘విక్టరీ’ అనే బిరుదు ఎందుకు తొడిగారని ప్రశ్నించాడు. మెగా ఫ్యామిలీకి ఇచ్చిన నాగబాబు -మెగా బ్రదర్, పవన్‌ కల్యాణ్‌ - పవర్‌ స్టార్, రామ్‌చరణ్‌తేజ - మెగా పవర్‌ స్టార్‌, సాయిధరమ్‌ తేజ - సుప్రీమ్‌ స్టార్ బిరుదులనూ రాధాకృష్ణ తప్పుబట్టారు. 

మహేష్‌ బాబు ఏ దేశానికి యువరాజని ఆయనకు ప్రిన్స్‌ అనే బిరుదిచ్చారు.. మంచు మనోజ్‌ రాకింగ్‌ స్టార్ ఎలా అయ్యారని ప్రశ్నించడమే కాదు.. సినిమా ఆడకపోతే ఆయన కుటుంబమే ఆర్థికంగా రాక్‌ అవుతుందంచూ సెటైర్లు కూడా వేశారు. మరి ఈ హీరోలు.. వేమూరి రాధాకృష్ణపై ఎలా స్పందిస్తారో చూడాలి..?


మరింత సమాచారం తెలుసుకోండి: