పవన్ కళ్యాన్ సినిమా ఇండస్ట్రీలో మెగా అభిమానం సంపాదించుకున్న తర్వాత రాజకీయ రంగం వైపు నడిచాడు... అంతే కాదు జనసేన అనే పార్టీనే స్థాపించాడు. ముందు నుంచి ప్రజా సేవ చేయాలనే తాపత్రయంతో ఉండే పవన్ కళ్యాన్ తన పార్టీ స్థాపన తర్వాత ఎలక్షన్లో నిలవకుండా ముందు ప్రజల్లోకి వెళ్లాలి అనే సంకల్పంతో ఉన్నాడు. ఆ మధ్య ఏపీ రాజధాని భూ నిర్వాసితుల ను కలుసుకొని వారి బాధల గురించి విన్నాడు. రైతులకు అన్యాయం అయితే  అవసరమైతే దీక్ష చేస్తానని కూడా బరోసా ఇచ్చాడు.     అదే విధంగా ఆ మద్య అనారోగ్యంతో ఉన్న ఓ పాప తనకు పవన్ కళ్యాన్ ని చూడాలని వెంటనే వెళ్లి కలిసి పాపకు ధైర్యం చెప్పాడు. అ పాప పేరే శ్రీజ. ఇప్పుడు ఆ పాప పూర్తిగా కోలుకుంది.       


శ్రీజను ఆత్మీయంగా పలకరిసూ తను చెప్పేది వింటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఓదార్పుతో తిరిగి కోలుకున్న 'శ్రీజ' తన తల్లిదండ్రులు నాగయ్య,నాగమణి సోదరి షర్మిల శ్రీ లతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం తన అభిమాన నటుడు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'ను ఆయన కార్యాలయంలో కలిశారు.


శ్రీజ కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాన్


దాదాపు రెండుగంటల సమయం 'పవన్ కళ్యాణ్' శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాట్లాడుతూ..' శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజ కు  వైద్యం చేసిన డాక్టర్ 'అసాదారణ్' కు కృతఙ్ఞతలు తెలిపారు. 'శ్రీజ' కుటుంబ సభ్యులు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: