మొన్న ‘మా’ మూవీ అసోసియేషన్ అధ్యక్ష పదవి విషయంలో మొదటి నుంచి రాజేంద్రుడికి వెన్ను దన్నుగా నిలుస్తూ ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని వ్యతిరేక పవనాలు వచ్చినా అవన్నీ భరిస్తూ సపోర్ట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. అంతే కాదు పేద కళాకారులను ఆదుకోవడానికి ఎప్పుడూ రాజేంద్రుడికి సలహాలు సూచనలు ఇవ్వడానికి తాను రెడీ అంటున్నాడు. ఇచ్చిన మాట నిలుపుకోవడానికి రాజేంద్రప్రసాద్ కి సహాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానంటున్నాడు నాగబాబు.


మా ఎలక్షన్స్ టైమ్ లో రాజేంద్ర ప్రసాద్ తరుపున మాట్లాడుతున్న నాగబాబు


ఇక మొదటి నుండి రాజేంద్రుడి కి అండగా నిలిచిన మెగా కుటుంబం రాజేంద్రుడు పదవీ ప్రమాణం చేసే సమయంలో ఆరు లక్షల విరాళాన్ని ప్రకటించడమే కాకుండా స్పాట్ లో లక్ష రూపాయల చెక్ ని కూడా అందించాడు నాగబాబు .   నాగబాబు తనయుడు వరుణ్ లక్ష ,చరణ్ రెండు లక్షలు ,అల్లు అర్జున్ లక్ష ,సాయి ధరమ్ తేజ్ లక్ష ఇలా మొత్తం కలిసి ఆరు లక్షల రూపాయలను ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు . లక్ష రూపాయల చెక్ ఇచ్చిన నాగబాబు త్వరలోనే మిగతా మొత్తాన్ని ఇస్తామని చెప్పారు . ఇక రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన 50 మంది పేద కళాకారులకు నెల నెలా సహాయం అందిస్తామని తెలిపారు . అంతే కాదు రాజేంద్ర ప్రసాద్ కు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న రోజా కూడా లక్ష రూపాయల విరాళాన్ని అందించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: