మెగా హీరోలలో అల్లుఅర్జున్ వెరీ స్సెషల్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మెగా హీరోలలో బాగా డ్యాన్స్ చేసే హీరో ఎవరంటే అల్లుఅర్జున్ మొదటి వరుసలో ఉంటాడు. అందుకే టాలీవుడ్‌లో స్టైలిష్‌స్టార్‌గా అల్లుఅర్జున్‌కు మంచి పేరు ఉంది.

ఇదిలా ఉంటే, అల్లుఅర్జున్ కి బిటౌన్ లో ఆఫర్ వరించిందనే విషయం తెలిసిందే. ‘ఎబిసిడి2’ అనే మూవీలో గెస్ట్ రోల్ లో నటించేందుకు పిలుపు వచ్చింది. రెమోడిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, వరుణ్‌ధావన్‌, శ్రద్దాకపూర్‌ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దీనికి సంబంధించిన వార్తలపై అల్లుఅర్జున్‌ క్లారిటీ ఇచ్చాడు.

గెస్ట్ రోల్ చేయటం అనేది తనకు ఇష్టం లేదని, పూర్తి ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే డైరెక్ట్ గా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తరువాత రోజుల్లో బాలీవుడ్‌లో చేయడం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఇప్పుడైతే నేను ఏ బాలీవుడ్‌ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయడం లేదంటూ ఫుల్ క్లారిటి ఇచ్చాడు.

దీంతో ప్రభుదేవా రంగంలోకి దిగి, ఎబిసిడి2 మూవీ తెలుగు వర్షెన్ లో చిరంజీవి గెస్ట్ రోల్ కోసం కోసం, బన్ని చేత చిరంజీవిని అడిగించాడంట. అందుకు చిరంజీవి సైతం బన్నీ కి నో చెప్పాడు. ఇప్పుడెందుకురా ఇదంతా? అంటూ సున్నితంగా చిరు చెప్పినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: