ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీలను ఎంత త్వరగా, ఎంత భారీగా నిర్మించడం అనేది చాలా కామన్ విషయం. అయితే ఎంత చిన్న, పెద్ద మూవీ అయినప్పటికీ, ఆ మూవీని ధియోటర్ లో రిలీజ్ చేయటమనేది చాలా పెద్ద విషయం.

ప్రస్తుతం బాలకృష్ణ నటించిన లయన్ మూవీ రిలీజ్ కి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఏ మూవీకైనా నైజాం మార్కెట్ అనేది చాలా కీలకం. అటువంటిది లయన్ మూవీకి నైజాంలో చాలా తక్కువ డిమాండ్ ఏర్పడిందనే టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నైజాంలో బాలయ్య చాలా వీక్‌ అని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి.

తను గతంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీలు సింహా, లెజెండ్ కి సంబంధించిన కలెక్షన్స్ కూడా నైజాంలో తక్కువుగానే ఉన్నాయంట. దీంతో ‘లయన్‌’ చిత్రాన్ని నైజాంలో కొనడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు.

చివరగా ఈ సమస్యకి పరిష్కారం కోసం ఈ చిత్రాన్ని దిల్‌రాజు చేతికి అప్పగించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన దిల్‌రాజు ‘లయన్‌’ను కొనడానికి ముందుకొచ్చాడట....! కాకపోతే మరీ తక్కువ రేటును ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత ప్రస్తుతానికి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: