పవన్ క్రితం సంవత్సరం ఫిబ్రవరిలో ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుండి ఎదో ఒక అనుకోని విపత్తు ఈ సినిమాను వెంటాడుతూనే ఉంది. అనేక ట్విస్టుల తరువాత వచ్చేనెల నుండి ప్రారంభం అవుతుంది అని  ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిన్న ఢిల్లీలో జరిగిన రాజకీయ పరిణామాలు ఊహించని షాక్ ఇచ్చాయి అని వార్తలు వస్తున్నాయి. నిన్న కేంద్రప్రభుత్వం లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్‌స్టేటస్ ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. 

14వ ఆర్థికసంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ చేసిన ప్రకటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ఈ విషయం పై ఎలా స్పందిస్తాడు? ఎలాంటి పాత్ర వహించబోతున్నాడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పవన్ మరో ఉద్యమానికి సిద్ధ పడతాడా లేదంటే తనకేమి సంబంధం లేదు అనుకుంటూ ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం తన ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ ను మొదలు పెట్టి తన మౌన ముద్రని ఇలాగే కొనసాగిస్తాడా అన్న ఆశక్తి పవన్ అభిమానులలోనే కాకుండా సాధారణ ప్రజానీకంలో కూడ అప్పుడే మొదలైంది.

కొద్ది రోజుల క్రితం తన ట్విటర్ లో ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని కేంద్రప్రభుత్వానికి గుర్తు చేసి మళ్ళీ మౌనం లోకి వెళ్ళిపోయాడు పవన్. ఇప్పుడు కూడ అదే సీన్ రిపీట్ చేస్తూ తన అసమ్మతిని మోడీ సర్కారుకు తెలియచేస్తూ ఒకే ఒక్క ట్విటర్ తో పని ముగించేసినా ఆశ్చర్యం లేదు అని కొందరి భావన.  

ఇప్పటి వరకు పవన్ ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఈ రెండు పడవల ప్రయాణాన్ని అతి చాకచక్యంగా నడుపుకుంటూ వస్తున్నా లేటెస్ట్ గా కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో తీసుకున్న నిర్ణయం పై సరైన స్పందన పవన్ వైపు నుంచి రాకపోతే రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ సిద్ధాంతాల పై ముఖ్యంగా జనసేన పార్టీ పై నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో పవన్ కు లేటెస్ట్ గా కేంద్రప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం తలనొప్పిగా మారడమే కాకుండా పవన్ ను తీవ్ర అంతర్మధనంలో  నెట్టివేసే ఆస్కారం ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.. 




మరింత సమాచారం తెలుసుకోండి: