ఫ్యాక్షన్ సినిమాలు దెయ్యం సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకు పెళ్ళి పై మానవ  సంబంధాల పై నమ్మాకం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే అటువంటి వర్మ పెళ్ళికి ఒక కొత్త  నిర్వచనం యిస్తూ లేటెస్ట్ గా తీస్తున్న ’365 డేస్’ ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు పూరీజగన్నాథ్ వివాహ వ్యవస్థ పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. 

మన దేశంలో అతి తక్కువ కాలంలోనే పెళ్లి వ్యవస్థ మాయమైపోతుందని పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్థుత తరం పిల్లలు తమ తల్లితండ్రుల కంటే స్నేహ బంధానికే విలువ ఇస్తున్నారని దీనితో తల్లితండ్రులు కూడ తమ పిల్లలతో స్నేహితులులాగే మేలుగుతున్నారని అంటూ దీనిని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్ లో వివాహ బంధాలు కూడ స్నేహ బంధాలుగా మారిపోయి భారత దేశంలో అతి కొద్ది కాలంలోనే పెళ్లి అనే పదం వినపడదని శబ్దంగా మారిపోయే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్స్ చేసాడు పూరి.  

అయితే ఈ కామెంట్స్  విన్న చాలామంది మన దేశంలో  కూడ పెళ్ళిళ్ళ సాంప్రదాయం పోయి జమైకా, స్పెయిన్ లా ఇండియా కూడ తయారు అవుతుందా అంటూ కామెంట్స్ విసురుకున్నారు. ఇదే సందర్భంలో పూరీ మరింత వివరంగా మాట్లాడుతూ తనకు రామ్ గోపాల్  వర్మతో ఉన్న స్నేహ బంధం 20 ఏళ్ల బంధం అని అంటూ ఏ రిలేషన్ షిప్ అయినా కాపాడుకుంటూ వస్తేనే అది ఉంటుందని లేకుంటే ఏ రిలేషన్ షిప్ అయినా నిలబడదు అంటూ పెళ్ళి కూడ అటువంటి బంధమే అన్నాడు పూరి.

ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్న ఈ ఆడియో వేడుకలో చివరిన పెళ్ళి పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రామ్ గో పాల్ వర్మ తనను చాలామంది మీ పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది అని అడుగుతూ ఉంటారని దానికి తాను చెప్పే సమాధానం ఒక్కటే అని అంటూ తనకు మంచి భార్య దొరికింది, కానీ తన భార్యకి ఒక చెడ్డ మొగుడు దొరికాడుఅంటూ  తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు  వర్మ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: