అల్లు అర్జున్.. యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఎనర్జిటిక్ యాక్టింగ్, డైనమిక్ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మామ మెగాస్టార్ అభిమానులను తన అభిమానులుగా చేసుకున్నాడు. 



అల్లు అర్జున్ కు తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. మళయాళంలో అయితే అల్లు అర్జున్ కు విపరీతమై క్రేజ్ ఉంది. అక్కడి లోకల్ హీరోలతో సమానంగా మళయాళీలు అల్లు అర్జున్ ను అభిమానిస్తారు. ఇలాంటి అరుదైన అభిమానం అల్లు అర్జున్ కే దక్కింది. 

అందుకే అల్లు అర్జున్ సినిమాల మళయాళీ రీమేక్ రైట్స్ పెద్ద మొత్తాలకు అమ్ముడుపోతాయి. అక్కడ డైరెక్టు సినిమాల రేంజ్ లో అల్లు అర్జున్ సినిమాలు వసూలు చేస్తాయి. ఆ అభిమానంతోనే ఓ మళయాళ నిర్మాత ఈ కుర్ర హీరో సినిమా రైట్స్ తీసుకుని ఓ సినిమా రిలీజ్ చేసుకున్నాడు.


మళయాళీలు ఓనం పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలిసిందే. అల్లు అర్జున్ పై అభిమానంతో ఆ నిర్మాత.. ఓనం పండుగ రోజు శుభాకాంక్షలు చెబుదామని ఫోన్ చేశాడట. పాపం ఇంత కష్టపడి ఆయన ఫోన్ చేస్తే.. అల్లు కనీసం ఫోన్ రిసీవ్ చేసుకోలేదట. సార్ బిజీ అని చెప్పి పెట్టించేశారట. ఈ సంగతి.. ఓ ప్రముఖ తెలుగు పత్రిక బయటపెట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: