దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై సెటైర్లు వేయాలి అంటే చాల ధైర్యం ఉండాలి. కానీ హీరో నాని ఈమధ్య ప్రసారం అయిన ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో అందరి ఎదుట రాఘవేంద్రరావుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసి  సంచలనం సృస్టించాడు. గతంలో నాని హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర పని చేసాడట.


రాఘవేంద్రరావు తన సినిమాల టైటిల్ కార్డులలో


ఆ సందర్భంలో రాఘవేంద్రరావు తన సినిమాల టైటిల్ కార్డులలో ‘కె.రాఘవేంద్రరావు బి.ఏ.’ అని ఖచ్చితంగా తన డిగ్రీతో సహా వేసుకునే రాఘవేంద్రరావు అలవాటును చూసి మొదట్లో అది రాఘవేంద్రరావు సెంటిమెంట్ అనుకున్నాడట నాని. అయితే అసలు విషయం తనకు తెలిసి ఆశ్చర్యపోయాను అంటూ ఈ ‘ఈగ’  హీరో ఆయన పై సెటైర్లు వేసాడు.


రాఘవేంద్రరావు కూడ తెగ నవ్వుకున్నాడు


రాఘవేంద్రరావు తన సినిమాలలో హీరోయిన్స్ గా నటించే అలనాటి గ్లామర్ బ్యూటీస్ రమ్యకృష్ణ, శ్రీదేవి లాంటి ఎందరి పైనో వారి అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ వారి పై పువ్వులు, పండ్లతో హీరోయిన్స్ బొడ్డు భాగాన్ని టచ్ చేసే విధంగా రొమాంటిక్ సీన్స్ తీస్తూ టాప్ డైరెక్టర్ అయిన నేపధ్యంలో ఆ విషయాన్ని జనానికి గుర్తు చేస్తూ ఉండటానికి రాఘవేంద్రరావు ఇలా తన పేరు పక్కన డిగ్రీని వేసుకుంటాడని, ‘బి.ఏ.’ అంటే డిగ్రీ సర్టిఫికేట్ కాదని ఈ బి.ఏ. కు అర్ధం 'బొడ్డు పై యాపిల్' అని అప్పట్లో తనతో రాఘవేంద్రరావు దగ్గర పనిచేసే మరో అసిస్టెంట్ డైరెక్టర్ కామెంట్ చేసాడు అంటూ అప్పటి విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడంతో రాఘవేంద్రరావు కూడ తెగ నవ్వుకున్నాడు.


ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా పువ్వులు, పండ్లు చూసినప్పుడల్లా తెలుగు సినిమా ప్రేక్షకులకు రాఘవేంద్రరావు గుర్తుకు వచ్చి తీరుతాడు. అటువంటి రాఘవేంద్రరావు నేడు భక్తి సినిమాల చిరునామాగా మారడం కాలం ఆయనలో తీసుకు వచ్చిన మార్పు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: