ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో బన్నీ నటించబోతున్న అప్ కమింగ్ మూవీపై హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ న్యూస్ కి సంబంధించి ప్రతి అప్ డేట్స్ ని అందరూ వినటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, దాదాపు తన మెద‌టి చిత్రం నుండి వ‌రుస విజ‌యాలు సాదిస్తూ టాలీవుడ్ లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.


అల్లు అర‌వింద్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ లు క‌లిసి బోయ‌పాటి శ్రీను కి అభినంద‌న‌లు


బోయపాటి శ్రీను పుట్టిన‌రోజు సందర్భంగా, మెగా ప్రొడక్షన్ హౌస్, బోయపాటి పుట్టినరోజు వేడుకలని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఘనంగా చేశారు. మాస్‌ ఇమేజ్ కి కేరాఫ్ అడ్రస్ గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెలుగు అభిమానుల గుండెల్లో మంచి స్టానాన్ని సంపాదించారు. అల్లు అర‌వింద్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ లు క‌లిసి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కి అభినంద‌న‌లు తెలిపి త‌న‌ చేత పుట్టినరోజు కేక్ క‌ట్ చేయించడం ఇండస్ట్రీ టాక్ గా మారింది.


బహుశ అల్లుఅర్జున్ తో సినిమాలు తీయబోతున్న దర్శకులకు ఇటువంటి ట్రీట్ ఇవ్వటం బన్నీకి కూడ కొత్తగానే ఉంది. అయితే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా గీతాఆర్ట్స్ లో త్వ‌ర‌లో చిత్రం ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే.


అందుకే బోయపాటికి ఓ స్పెషల్ గిప్ట్ ఇచ్చి, మంచి అవుట్ పుట్ ని తీసుకురావాలనే ఉద్ధేశంతోనే ఈ పుట్టిన‌రోజు వేడుకలను జరిపారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బోయపాటి మూవీలో ఎప్పటిలాగే ఉండే విపరీమైన యాక్షన్ లేకుండా, బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: