సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల్లోనే సంచనం కాదు.. తన ట్విట్స్ లోనూ సంచలనాలకు తెర లేపుతున్నాడు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం నాది అనే రాంగోపాల్ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ వాళ్ల  పై కామెంట్ చేస్తూ ట్విట్స్ చేశాడు. కొనిన సార్లు వీటిపై   పెద్ద  దుమారమే చెలరేగుతున్నాయి. అది అలా ఉంటే ఇప్పడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుపై పడ్డాడు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ పాట అదుర్స్ అని రామ్ గోపాల్ వర్మ కితాబిచ్చాడు. 


బర్నింగ్ స్టార్  సంపూర్ణేష్ బాబు స్టిల్


కొబ్బరి మట్ట సినిమా కోసం కొబ్బరి ఆకులు కలగలిపే.. అంటూ సాగే పాట పడిన సంపూర్ణేష్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతే కాదండోయ్ మనోన్ని.. సంపూర్ణేష్ ది ఓన్లీ హీరో, రియల్ హీరో అంటూ ప్రశంసించడమే కాకుండా సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవిల కంటే సంపూ బెటరని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.  మరి సంపూర్ణేష్ బాబు పెట్టె కితకితలతో రాంగోపార్ వర్మ మతి తప్పిందో లేక సంపూని ఈ రకంగా పొగిడి ఏడిపించాలనుకున్నాడో కాని ఈ ట్విట్ ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: