ఈమధ్య కాలంలో తమ సినిమాలను సరిగ్గా అర్ధం చేసుకోకుండా రివ్యూలు వ్రాస్తున్నారు అంటూ మీడియా పై  దర్శకుల హీరోల సెటైర్లు పెరిగి పోతున్నాయి. ‘ఓకే బంగారం’ సినిమా అర్ధం కాకపోతే రివ్యూలు రాయవద్దని మణిరత్నం భార్య సుహాసిని కోరితే, కొద్దిరోజుల క్రితం  అల్లుఅర్జున్ కూడా తన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు రివ్యూలు అపకారం చేసాయి అంటూ  కామెంట్లు చేసాడు.

తెలుగు సినిమా నిర్మాతల మండలి


ఈ  యుద్ధాన్ని మరింత కొనసాగిస్తూ తెలుగు సినిమా నిర్మాతల మండలి మీడియా సంస్థలకు ప్రతి శుక్రువారం విడుదల అయ్యే సినిమాల పై రివ్యూలు రాయవద్దని అదేవిధంగా తమ సినిమాల పై అప్ట్ డేట్స్ పెట్టవద్దని మీడియాను కోరుతూ లిఖిత పూరకమైన విజ్ఞాపనను పంపడానికి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రివ్యూల వల్ల


అయితే భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం ఏ వ్యక్తి అయినా తన ఫేస్ బుక్ లో చేసుకున్న కామెంట్స్ ఆ వ్యక్తి వ్యక్తిగత భావన అని కామెంట్స్ చేసిన నేపధ్యంలో మీడియా స్వాతంత్రం పై నిర్మాతల మండలి ఆంక్షలను మీడియా సంస్థలు గుర్తిస్తాయా అన్నది ప్రశ్న. రివ్యూల వల్ల సినిమా కలెక్షన్స్  ప్రభావితం  అవుతాయి అనుకుంటే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు బాగా లేకపోయినా వచ్చిన భారీ కలెక్షన్స్  నిర్మాతల మండలికి దృష్టికి రాలేదా అనే సందేహాలు చాలామంది వ్యక్త పరుస్తున్నారు. 

ఎంతో గొప్పగా రివ్యూలు వ్రాసిన


మీడియా సంస్థలు రాసే రివ్యూలకు అంత ప్రాధాన్యత ఉంటే మీడియా ఎంతో గొప్పగా రివ్యూలు వ్రాసిన ‘నా బంగారు తల్లి’ సినిమాను  ప్రదర్శించడానికి ధియేటర్లు కూడ దొరకని పరిస్థితి ఏర్పడిన విషయం నిర్మాతల మండలకి తెలియదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఎలా చూసుకున్నా రివ్యూలను చూసి నిర్మాతలు ఎంత భయపడి పోతున్నారో అర్ధంఅవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: