మహాకవి శ్రీశ్రీ కి కవిత్వం పట్ల ఎంతటి మక్కువ ఉందో అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు మంచి పాత్రలలో నటించి మెప్పించి దాహం తీర్చుకోవాలి అన్న తపన చాల ఎక్కువ. అందుకే దక్షణాది నుండి ఉత్తారాది వరకు ఏ సినిమా రంగంలో అయినా ప్రకాష్ రాజ్ కు వరస పెట్టి అవకాశాలు రావడమే  కాకుండా కొందరు దర్శకులు అయితే ప్రకాష్ రాజ్ ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు సృష్టిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ తన గురువు


అటువంటి ప్రకాష్ రాజ్ తన గురువు గిరీష్ కర్నాడ్ రాసిన నాటకంలో నటించడానికి కొన్ని సినిమాలను వదులు కుంటున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. గిరీష్ కర్నాడ్ వ్రాసిన కొత్త నాటకం ‘మంత్రపుష్పం’ ఇప్పటికే కన్నడ నాటక రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. భక్తి శృంగారం ఈరెండు కధాంశాలను  నేటి వర్తమాన పరిస్తుతులతో మేళవించి గిరీష్ కర్నాడ్ ఈ నాటకం రచించాడు.

పూజారి పాత్రను  ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు


ఈ నాటకంలోని అత్యoత కీలకమైన పూజారి పాత్రను  ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఈ నాటకాన్ని అతి త్వరలోనే బెంగుళూరులోని ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ప్రదర్శించబోతున్నారు. అయితే ఈ పూజారి పాత్రలో నటించడం కోసం ప్రకాష్ రాజ్ ఒక కొత్త నటుడిలా రిహార్సల్స్  కు వెళుతూ దీనికోసం కొన్ని సినిమాలను కూడా వదులు కోవడం బట్టి ప్రకాష్ రాజ్ నాటకానికి ఎంత ప్రాదాన్యతను ఇస్తాడో అర్ధం అవుతుంది.


పర భాషలలోని టాప్ స్టార్స్ అంతా నాటకాన్ని బతికించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన టాప్ స్టార్స్ మటుకు కనీసం మంచి నాటక ప్రదర్శన చూడటానికి కూడ ఇష్టపడని పరిస్థుతులలో తెలుగు నాటక రంగం ఉంది అంటే అది దౌర్భాగ్యం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: