టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. అయితే ఈ మార్పులు అనేవి ఫిల్మ్ ఇండస్ట్రీలో అభివ్రుద్ధి కోసం ఎంత మాత్రం కావు. టాలీవుడ్ లో గ్రూపు రాజకీయాలు, సొంత పెత్తనాలు, అధికార దాహాలు వంటివి విపరీతంగా పెరిగిపోవడంతో, సినీ పెద్దలు అన్నా, సినిమా సేవ అన్నా ఎంత మాత్రం వారికి పట్టడం లేదు.

ప్రస్తుతం ఎవరికి అవకాశాలు ఎక్కువుగా వస్తుంటే తనే టాప్. ఇదిలా ఉంటే ఇక నుండి ఆంధ్రపదేశ్ ఫిల్మ్ చాంబర్ త్వరలోనే పేరు మార్చుకోబోతుంది. రాష్ట్రాల విభజనతో ఫిల్మ్ చాంబర్ కూడా రెండు గా చీలిపోయింది. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ మొదలైంది.

ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ అని ఉన్న పేరును తెలుగు ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ అనే పేరుకి మార్చడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఎపి ఫిల్మ్ చాంబర్ పేరు మార్చాలనే ఉద్ధేశంలో నిర్మాతలు విజయవాడలో మీటింగ్ పెడితే, తెలంగాణ నిర్మాతలు దీనికి వ్యతిరేఖంగా హైదరాబాద్ లో చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా ఎపి అండ్ తెలంగాణ ఫిల్మ్ చాంబర్స్ లో సమూలంగా మార్పులు జరుగుతున్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: