ఈమధ్య కాలంలో సెక్స్, సహజీవనం విషయాల పై  హీరోయిన్స్ దగ్గర నుండి వివిధ రంగాలలోని ప్రముఖ మహిళల వరకు వారివారి వ్యక్తిగత అభిప్రాయాలను బాహాటంగా వ్యక్త పరుస్తూ మీడియాలో సందడి చేస్తున్నారు.  ఈ విషయాల పై ఇప్పుడు తాప్సీ కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బయట పెట్టి మీడియాకు హాట్ న్యూస్ గా మారింది.

పెళ్లి చేసుకోకుండా కలిసి సహజీవనo చేయడం వల్ల ఎటువంటి తప్పు  లేదని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి అభిప్రాయలు కలవక విడాకులు తీసుకోవడంతో వారి ఇరు కుటుంబాలకు సంబందించి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి తన దృష్టిలో  పెళ్ళికన్నా  సహజీవనం చాల బెటర్ అంటూ  వ్యాఖ్యానించింది ఈ ఢిల్లీ బ్యూటీ.  

పెళ్లి చేసుకున్న తరువాత  నచ్చకపోతే విడిపోవచ్చు దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోంది తాప్సీ. ఇప్పటికే  భారతదేశంలో  బాగా చదువుకున్న అమ్మాయిలు పెళ్ళికన్నా సహజీవనం మంచిది అని వ్యక్తిగతంగా భావిస్తున్నారు అన్న  సర్వేలు వస్తున్న నేపధ్యంలో తాప్సీ కామెంట్స్  సహజీవన వ్యవస్థకు  మరింత ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.
 
ఇదే  సందర్భంలో స్త్రీల  పై జరుగుతున్న అత్యాచారాల విషయమై తాప్సీ మాట్లాడుతూ  హీరోయిన్‌కు మాత్రమే కాదు సాధారణ స్త్రీకి కూడా భద్రత లేకుండా పోయింది అని అంటూ  లైంగిక వేధింపుల సమస్య పై తన అభిప్రాయాన్ని  కూడా తెలియచేసింది. అలాంటి చర్యలకు పాల్పడే వారికి అవయవాలు పనిచేయనివ్వకుండా శిక్షించాలి అంటూ అదే అత్యాచారాలకు సరైన శిక్ష అని కామెంట్ చేస్తున్న తాప్సీ మాటలు మన చట్టాలను తయారు  చేస్తున్న రాజకీయ వేత్తలను ప్రభావితం చేయగలుగుతాయా అన్నదే ప్రశ్న...   



మరింత సమాచారం తెలుసుకోండి: