హీరోయిన్స్ తో డేటింగ్ వ్యవహారాలలో ఎప్పుడూ హాట్ హాట్ న్యూస్ లో ఉండే రానా ఒకేసారి చెన్నైలో తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా పెళ్ళికొడుకుగా మారడం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ఈ పెళ్ళికి రానా తన సన్నిహిత మిత్రులకు కూడా చెప్పకుండా రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్లు టాక్. ఈ పెళ్ళి ఫోటోను స్వయంగా రానా మీడియాకు లీక్ చేసాడు.

అయితే ఈ తతంగం అంతా ప్రస్తుతం రానా నటిస్తున్న ‘బెంగుళూర్ డేస్’ తమిళ రీ మేక్ కు సంబంధించింది. ఇప్పటి వరకు అనేక సినిమాలలో అనేక గెటప్స్ లలో కనిపించిన రానా మొట్టమొదటి సారిగా పెళ్ళి కొడుకు గెటప్ లో ఈ సినిమాలో కనిపిస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

‘నా మొట్టమొదటి సినిమా పెళ్ళి’ అంటూ రానా ఈ పెళ్ళి ఫోటోను తన ఫేస్ బుక్ లో పెట్టాడు. రానా సరసన తేలుగుఅమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పివిపి నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నఈ ‘బెంగుళూర్ డేస్’ మలయాళంలో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

‘బాహుబలి’ , ‘రుద్రమదేవి’ సినిమాలు తరువాత రానా తన గుబురు గెడ్డాన్ని పూర్తిగా తీసివేసి చక్కగా పెళ్ళికొడుకులా మారిన ఫోటో ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. మొట్టమొదటిసారి సినిమా పెళ్ళి కొడుకుగా మారాడు కాబట్టి ఇక ఈ డేటింగ్ ల వ్యవహారానికి గుడ్ బై చెప్పి నిజమైన పెళ్ళికొడుకుగా త్వరలోనే అవుతాడు అనుకోవాలి.. 






మరింత సమాచారం తెలుసుకోండి: