ఎంతటి  గొప్ప వ్యక్తికైనా ఒకే ఒక్కసారి అదృష్ట  దేవత తలుపు తట్టుతుంది. అయితే  తన తలుపు తట్టిన అదృష్టాన్ని సరిగ్గా గుర్తించలేక వదులుకుంటే మళ్ళీ ఆ అదృష్టం మళ్ళీ రాదు అని అంటారు. కాని  టాలీవుడ్  ఎంపరర్  పవన్ కళ్యాణ్ విషయంలో ఈ అదృష్ట దేవత రెండు సార్లు పవన్ ఇంటి తలుపు తట్టినా సరిగా ఉపయోగించుకోవడంలో వెనకపడిపోయాడు అంటూ ఒక  విశ్లేషణనను తెరపైకి  తీసుకువస్తున్నారు.


పవన్ కళ్యాణ్ నటించిన బ్లాకు బస్టర్ మూవీ


పవన్ కళ్యాణ్  నటించిన తోలి  బ్లాకు బస్టర్  మూవీ  ‘ఖుషి’ విడుదలై 14 సంవత్సరాలు పూర్తి  అయిన సందర్భంగా పవన్ వీరాభిమానులు ఈ విశ్లేషణలను  తెరపైకి  తీసుసుకు వచ్చారు. 2001 లో ‘ఖుషి’ విడుదల తరువాత ఆసినిమా ఘన విజయాన్ని చూసి మెగా స్టార్ చిరంజీవి తనకు నిజమైన పోటి తన తమ్ముడు పవన్ నుంచి మాత్రమే అని ఆరోజులలో కామెంట్ చేసాడు అంటే పవన్ అప్పటికే స్థాయికి చేరిపోయాడో అర్ధం అవుతుంది.


పవన్ ఘోరమైన ఫ్లాప్ అందుకోవడమే


అయితే తరువాత  తనకు ఎన్నో అవకాశాలు వస్తున్నా వాటిని వదులుకొని తనకు  అనవసరమైన దర్శకత్వం  భాద్యతను తలకు ఎత్తుకొని ‘జాని’ సినిమాను తీసి ఘోరమైన ఫ్లాప్ అందుకోవడమే కాకుండా ఆ  ఫ్లాప్ భారంతో 10  సంవత్సరాలు ఒక సరైన హిట్ లేకుండా కాలం గడిపాడు. ఆ తరువాత  పవన్ ఎంతగానో ఎదురు చూసిన బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’  ద్వారా పోగొట్టుకున్న క్రేజ్ ను తిరిగి పొందడమే కాకుండా ఆ తరువాత  వచ్చిన ‘అత్తారింటికి  దారేది’ తో టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయాడు.


 పవన్ రాజకీయాల బాట బట్టి


ఈ  సంఘటన తరువాత ఎందరో పవన్  ఇంటి చుట్టూ తిరుగుతున్నా  మరెన్నో  మల్టీ నేషనల్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసి పెట్టమని కోరుతున్నా వస్తున్న కోట్లను జారవిడుచుకుని గత సంవత్సరం ఎన్నికల సమయంలో రాజకీయాల బాట బట్టి తన విలువైన కాలాన్ని వృథ చేసుకోవడమే కాకుండా తన అభిమానులను  అదేవిధంగా తనరాజకీయ  ఎత్తుగడలలో జాతీయ నాయకులను మెప్పించలేక పవన్  రాజకీయాలకు పనికిరాడు  అనే అపవాదును మూట కట్టుకున్నాడు. ఏది ఎలా చూసుకున్నా రెండుసార్లు తలుపు తట్టినా అదృష్ట దేవతను సరిగ్గా అర్ధంచేసుకుని ఉపయోగించుకోలేని వ్యక్తిగా పవన్ మిగిలి పోయాడు  అనుకోవాలి..

 





మరింత సమాచారం తెలుసుకోండి: