ఈరోజు సమంత పుట్టినరోజు సందర్బoగా సమంత వీరాభిమాని రాసినట్లుగా ఒక ప్రముఖ దిన పత్రికలో అత్యంత ప్రముఖంగా ప్రచురితమైన బహిరంగ లేఖ సమంత అభిమానులకే కాదు సమంతకు కూడా ఆశ్చర్య కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘నిన్ను వెండితెర పై తొలిసారి చూసి అప్పుడే ఐదేళ్ళు పూర్తి అయిపోయిoదా’ అంటూ నీవు నటించిన ‘ఏమి మాయ చేసావే’ సినిమాలో  చర్చలో పెళ్ళి కూతురుగా కనిపించినప్పుడు దగ్గరకు వచ్చి నిన్ను ముద్దు పెట్టుకునేంత అందంగా కనిపించావు అంటూ సమంత అందానికి తాను ఎలా  అభిమానిగా మారిపోయాడో వివరించాడు ఆ అజ్ఞాత అభిమాని. 

నిండుగా చీర కట్టుకుని హంస లా


అంతేకాదు నిండుగా చీర కట్టుకుని హంస లా స్లో మోషన్ లో  నడుస్తూ ఉంటే నీకు అభిమానిగా మారని వ్యక్తి ఉంటాడా అంటూ సమంత అందాన్ని తెగ పొగిడాడు. అనుష్క అంత ఎత్తు లేకపోయినా తమన్నలా మిల్కీ బ్యూటీ కాకపోయినా చాల మంది టాప్ హీరోయిన్స్ లా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయలేకపోయినా  టాప్ హీరోలందరిని నీమాయతో కట్టి పడేస్తున్నావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ఆ వీరాభిమాని.

పండు వెన్నెలoత చల్లగా


పండు వెన్నెలoత చల్లగా వెనీలా ఐస్ క్రీమ్ తిన్నంత మధురంగా కనిపించే నిన్ను అభిమానించనివాడు ఈ ప్రపంచoలో ఉంటాడా అంటూ తన అభిమానాన్ని మరింత చాటుకున్నాడు. చీర కట్టుకుని స్వీట్ గానే కాదు పొట్టి నిక్కరుతో హాట్ గా కనిపించే సరిలేరు నికేవ్వరు  అంటూ ‘నీవు రెండు వైపులా పదునైన కత్తివి’ అంటూ సమంతను  ఎక్కడో కూర్చో పెట్టాడు ఆ అభిమాని.
 

ఈగ నైనా కాకపోతిని


‘ఈగ నైనా కాకపోతిని’ అంటూ తాను రోజుకు ఎన్ని సార్లో సమంత విరహంతో పాటలు పాడుకుంటున్నానని తన  బాధను వ్యక్త పరుస్తూ ‘నీ మంచి మనసుకు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా నీవు చేస్తున్న  సేవలకు ప్రియమైన జెస్సీ అలియాస్ సమంత నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’  అంటూ తన బహిరంగ లేఖను ముగించాడు. అందుకే సమంత క్యూట్ మాయలో ఎందరో అభిమానులే కాదు  టాప్ హీరోలే పడిపోతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: