ఒక వైపు ‘బాహుబలి’ సినిమా పనులు అనుకున్న సమయానికి పూర్తి అవ్వకపోవడంతో టెన్షన్ లో ఉన్న రాజమౌళికి మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి ఒక ప్రముఖ  ఛానల్ కు సంబంధించి లైవ్ ప్రోగ్రామ్ లో వ్యక్త పరచిన కోరిక రాజమౌళికి అనుకోని షాక్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఏ విషయాన్ని అయినా తన తండ్రి మోహన్ బాబు లానే మొహమాటం లేకుండా మాట్లాడే లక్ష్మిప్రసన్న తన డ్రీమ్ రోల్ కి సంబంధించి తన మనస్సులోని కోరికను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.


‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’ లాంటి వైవిధ్యభరితమైన సినిమాలలో నటించిన మంచు లక్ష్మికి భారత ప్రప్రధమ స్వాతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రను పోషించాలి అని ఉందట. అంతేకాదు ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తే తాను నటించాలి అని ముచ్చట పడుతోంది.


రాజమౌళి మంచు లక్ష్మి  కోరికను తీర్చగాలడా?


అయితే కోరిక  బాగానే ఉన్నా రాజమౌళి మంచు లక్ష్మి  కోరికను తీర్చగాలడా? ఒకవేళ రాజమౌళి ఆ సాహసం చేసినా మంచు లక్ష్మితో ఆ సినిమాను నిర్మించే సాహసం చేసే నిర్మాత ఎక్కడ దొరుకుతాడు అన్నది ప్రశ్న. బహుశా రాజమౌళి ఒప్పుకుంటే మోహన్ బాబు చేత కాని లేదంటే విష్ణు చేత కాని ఈ సినిమాను మంచు లక్ష్మి తీయిస్తుంది అనుకోవాలి.


‘దొంగాట’ సినిమా ప్రమోషన్ కార్యక్రమం


ఒక వైపు గుణ శేఖర్ తన ఆస్తులను తాకట్టు పెట్టి సాహసంతో నిర్మించిన ‘రుద్రమదేవి’ పరిస్థితి ఏమిటో ఇప్పటికీ తేలని నేపధ్యంలో మంచు లక్ష్మి ‘ఝాన్సీ లక్ష్మి’ కోరిక తీరని కోరికగానే మిగిలి పోయినా ఆశ్చర్యం లేదు. త్వరలో విడుదల కాబోతున్న తన ‘దొంగాట’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ కోరికను రాజమౌళికి చేరాలా చేసి షాక్ ఇచింది లక్ష్మి మంచు..


మరింత సమాచారం తెలుసుకోండి: