ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ బాహుబలి మూవీకి సంబంధించిన టాక్స్ హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి. ఇక రిలీజ్ కి సంబంధించిన విషయంలో రాజమౌళి పూర్తి క్లారిటి ఇచ్చాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న‘బాహుబలి’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఓ శుభవార్త. ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయక వాయిదా పడినా సినిమా కి సాంపిల్ గా చూపించే ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి రాజమౌళి టీం డేట్ ఫిక్స్ చేసింది. 

‘ముందుగా ఈ సినిమాని మే 15న రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ టెక్నికల్ గా ఆలస్యం అవడం వల్ల జూలైకి వాయిదా వేసాము. కానీ బాహుబలి ఫస్ట్ పార్ట్ అయిన బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ ని మాత్రం మే 31న రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 1 నుంచి బాహుబలి సినిమాలని పాత్రలకి సంబందించిన పోస్టర్స్ ని వరుసగా రిలీజ్ చేస్తామని’ రాజమౌళి తెలిపాడు.

దీంతో బాహుబలి మీద విపరీతమైన హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం సింగపూర్, హాంకాగ్, చైనా లాంటి ప్రదేశాల్లో ఈ సినిమాకి సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అలాగే మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: