రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి మే నెలలో సందడి చేయనుంది అని ఇప్పటికే చెప్పారు. అదే విధంగా మే డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మేడే ని పురస్కరించుకొని ఈరోజు బాహుబలి లుక్ ని రిలీజ్ చేసారు జక్కన్న. ఈ పోస్టర్ లో క్రియేటివిటీ చూస్తుంటే మహాసంద్రంలోంచి పైకి తన్నుకు వచ్చిన ఓ మహానాయకుడిని చేతిలో పట్టుకున్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టే చెప్పవచ్చు సినిమా రాజసం గురించి. 


బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్


గత కొంతకాలంగా సినిమాపై అనేక అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తగ్గట్లు రాజమౌళి ప్రతిసారి మీడియాలో ఏదో ఒక విధంగా సినిమా పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు మే నెలలో సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్య ఘట్టాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట.  సినిమా విడుదల ఆలస్యం అవుతుండటం తో మే 1నుండి మే 31 వరకు రోజుకొకటి చొప్పున ప్రచార చిత్రాలను రిలీజ్ చేస్తామని ఇదివరకే జక్కన్న తెలిపిన విషయం తెలిసిందే . జూలై లో ఈ చిత్రం రిలీజ్ కానుంది అందుకే అప్పటి వరకు ఈ బాహుబలి పై అంచనాలు తగ్గిపోకుండా చేసేందుకు ఇలా ప్రచార చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు . ఈరోజు రిలీజ్ చేసిన ప్రచార చిత్రం ఓ ప్రత్యేకత ని సంతరించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: