వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ పవన్ అభిమానులతో పెట్టుకున్నాడు. వర్మ పవన్ వీరాభిమాని అద్దంకి రవి పై వేసిన సెటైర్లు పవన్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న పవన్ అభిమాని అద్దంకి రవి దాదాపు 1500 కిలోమీటర్లు దూరంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చి పవన్ ను కలిసిన విషయo పై వర్మ ఈ వ్యాఖ్యలు చేసాడు. అంత దూరం శ్రమ పడుతూ సైకిల్ తొక్కుకుంటూ వచ్చి పవన్ కలవడం పనికిమాలిన చర్యగా అభివర్ణించాడు. 


పవన్ వీరాభిమానికి సూచనలు చేసాడు.

Pawan Kalyan with his Fan Pics 1

ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో స్పందిస్తూ పవన్ అభిమాని అంత కష్టపడి సైకిల్ పై వచ్చి తన సమయం, శక్తి రెంటిని వృధా చేసుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అయితే తన అభిమాన హీరోను కలవడానికి ఇలా కాకుండా  పవన్ అభిమాని రైలులో వచ్చి ఆ సమయాన్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తే బావుండేది కదా అంటూ పవన్ వీరాభిమానికి సూచనలు చేసాడు. అంతేకాదు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సహించవద్దు అంటూ పవన్ కు సలహాలు కూడ ఇచ్చాడు. 


వర్మ మళ్ళీ పవన్ అభిమానుల నుండి వ్యతిరేకత


అంతేకాకుండా  పవన్ తన అభిమానులు ఎవరూ ఇక ఇలా చేయవద్దు అంటూ  సూచనలు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు వర్మ. పవన్ ఇచ్చిన ఆలింగనం తోనైనా సైకిల్ పై వచ్చిన ఆ వీరాభిమాని మారతాడని తాను ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు. ఇన్ని కామెంట్స్ చేసిన వర్మ మళ్ళీ పవన్ అభిమానుల నుండి వ్యతిరేకత వస్తుందని భయ పడ్డాడు కాబోలు ‘నేను కూడ పవన్ అభిమానినే’ అంటూ మరో ట్విట్ చేసాడు. అయితే వర్మ ఇచ్చిన సలహాలు సూచనలు పవన్ వీరాభిమానులకు నచ్చకపోగా వర్మను టార్గెట్ చేస్తూ పవన్ అభిమాన సంఘాలు వర్మ పై మాటల దాడికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ వీరాభిమానుల మాటల దాడిని వర్మ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: