నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి హీరో శివాజీ కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ హోదా కలిగించలేము అని ప్రకటన ఇచ్చిన నేపధ్యంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 3వ తారీఖు నుండి గుంటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేసాడు. ప్రజలంటే ప్రభుత్వాలు భయపడే రోజులు రావాలని దానికోసమే తాను ఈ నిరాహారదీక్షను చేస్తున్నట్లు ప్రకటించాడు శివాజీ. 

అంతేకాదు రాజకీయ నేతలంతా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు శివాజీ. ఊరికి ఒక్క మనిషి తనతో కలిసివస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని ఆవేశంగా అన్నాడు శివాజీ. అంతేకాదు ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ కూడ తోడు అయితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా  వచ్చి తీరుతుందని ఆశా భావం వ్యక్త పరిచాడు శివాజీ. 

ఈ వార్తలు ఇలా ఉండగా ప్రత్యేక రాష్ట్ర హోదా విషయమై శివాజీ చేపట్టిన ఉద్యమానికి మెగా స్టార్ చిరంజీవి పోటీగా నిలుస్తున్నాడా అనే సంకేతాలు వచ్చేడట్లుగా చిరంజీవి కూడ శివాజీ కన్నా ఒక అడుగు ముందుగానే అడుగులు వేయబోతున్నాడు అని వార్తలు  వినిపిస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి నేడు గుంటూరులో ప్రత్యేక రాష్ట్ర హోదా పై ‘చిరంజీవి సత్యాగ్రహం’ పిలుపుతో ఒకరోజు నిరాహారదీక్ష చేయబోతున్నాడు అని  తెలుస్తోంది . 

ఈ నిరాహారదీక్షకు సంఘీభావం తెలపడానికి కోస్తా జిల్లాలలోని చిరంజీవి అభిమానులను భారీ సంఖ్యలో తీసుకు వచ్చి తిరిగి చిరంజీవి పవర్ ను  తెలియచేసే విధంగా ఈ సత్యాగ్రహ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి చిరంజీవి అభిమానుల సంఘం జాతీయ అధ్యక్షుడు స్వామినాయుడు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను బట్టి  చూస్తూ ఉంటే శివాజీ పిలుపుతో చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఒకరోజు ముందుగానే అదే గుంటూరులో హడావిడి చేయబోతున్నాడు అనుకోవాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: