సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వినూత్నమైన ప్రయోగాలు చేశారు. అసలు సినిమాల్లో ఫైటింగ్ సీన్లు, జెమ్స్ బాండ్,ఇన్వెస్టిగేషన్ సీన్లు లాంటివి, కౌబాయ్ సినిమాలు ఇవన్నీ ఈయన మొదలు పెట్టినవే. కృష్ణ వారసుడిగా చిన్నప్పుడే వెండి తెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అవడానికి వచ్చింది. నెక్స్ ప్రాజెక్టు ‘బ్రహోత్సవం’ సూపర్‌స్టార్‌ మహేష్‌, విక్టరీ వెంకటేష్‌లతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.


సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు


పి.వి.పి. సినిమా పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  పి.వి.పి. సినిమా పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పివిపి సినిమా లాంటి పెద్ద సంస్థలో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొంద నున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. అయితే ఈ సినిమా కృష్ణ పుట్టినరోజు ఈనెల 31. ఈ సందర్భంగా ముహుర్తం షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశారట. ఇది మహేష్ కోరిక మేరకు ఎందుకంటే తన తండ్రికి ప్రతి సంవత్సరం సినిమా పరంగా ఏదో రకమైన గిఫ్ట్ ఇవ్వడం మహేష్ కు అలవాటు అందేకోసమనే ముహుర్తం షూటింగ్ ఆరోజు ప్రారంభించాలని అనుకుంటున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: