నితిన్  ఇలియానాలు  మంచి స్నేహితులన్న సంగతి  చాలా మందికి తెలుసు. ఇలియానా తెలుగు సినిమాల నుండి దూరం వెళ్ళిపోయిన తరువాత కూడ వీరిదారి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఈమధ్య ఇలియానా టాలీవుడ్ లో నిర్మిస్తున్న ఒక టాప్ యంగ్ హీరో సినిమాలో ఐటెమ్ సాంగ్  చేయబోతోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై మరింత క్లారిటీ వస్తోంది. 


ఇలియానా ఐటమ్ సాంగ్ చేయబోతోంది


ఇలియానా అక్కినేని అఖిల్ వినాయక్  దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈసినిమాలోని ఐటమ్  సాంగ్ కు రాశి ఖన్నా పేరును నితిన్ వినాయక్ లు ఆలోచించినా రాశి ఖన్నా ఈ ఐటమ్ సాంగ్ పట్ల పెద్దగా ఇష్టం  చూపెట్టలేదు అని వార్తలు వస్తున్నాయి.

అఖిల్ తో స్టెప్స్ కలపబోయే  ఐటమ్ గర్ల్


దీనితో ఆలోచనలలో  పడ్డ ఈ సినిమా యూనిట్ అఖిల్ తో స్టెప్స్ కలపబోయే  ఐటమ్ గర్ల్ గురించి వేట  మొదలు పెట్టారు. అయితే  అనుకోకుండా నితిన్ కు ఇలియానా గుర్తుకు రావడంతో ఈ గోవా బ్యూటీ చేత  అఖిల్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుంది అన్న  ఆలోచన వచ్చినట్లు టాక్.


ఇలియానాతో నితిన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు


ఈ  విషయమై ఇలియానాతో నితిన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సీనియర్ యంగ్ హీరోలతో నటించి టాలీవుడ్ కు దూరమైపోయిన ఇలియానాతో అఖిల్ స్టెప్స్ వేస్తే జనం చూస్తారా ? అన్న సందేహం నితిన్ కు ఉన్నా ఈ ఆఫర్ ను ఏదోవిధంగా కొట్టేసి తిరిగి టాలీవుడ్ లోకి గ్రేట్ ఎంట్రీ ఇవ్వాలని ఇలియానా తహతాహ లాడిపోతోందని అంటున్నారు. ఈ వార్తలను విన్న అఖిల్ మాత్రం ఖంగారు పడిపోయి తన పక్కన ఇలీబేబీ ఏమిటి అంటూ నితిన్ వంక ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: