నందమూరి బాలకృష్ణ అంటే మంచు వారి కుటుంబానికి ఎనలేని గౌరవం. వీరి ఇరువురి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుంటుంది. మోహన్ బాబు అంటే బాలకృష్ణకు ఎనలేని గౌరవం. అంతేందుకు మంచు మనోజ్ కోరిన వేంటనే ‘ ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో బాలకృష్ణ నటించి మంచు వారి కుటుంభంపై అభిమానాన్ని చాటాడు. మరి ఇప్పడు నటసింహానికి మంచు లక్ష్మి పోటీకి సిద్దం అయ్యింది. నిజమే ఈ మాట వింటుంటే ఆశ్చర్యం వేసినా ఇది నిజం. 


 ‘ ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రం పోస్టర్


అవును బాలయ్య లయన్ చిత్రం ఈనెల 8న రిలీజ్ అవుతుండగా మంచు లక్ష్మి నటించిన దొంగాట కూడా మే 8నే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది లక్ష్మి . మే 1న దొంగాట చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ అనుకుంది కానీ ఉత్తమ విలన్ ,గంగ చిత్రాలు రిలీజ్ అవుతున్నందున మే 8కి వాయిదా వేసింది . ఇక అదే రోజు బాలయ్య లయన్ వస్తుండటంతో బాలయ్య తో మంచు లక్ష్మి కి పోటీ పడేలా ఉంది . మరి బాలయ్య సినిమా ముందు మంచు లక్ష్మి దొంగాట ఎలా ఆడుతుందో చూడాలి. మరి బాలయ్య ధాటికి మంచు లక్ష్మి తట్టుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: