తెలుగు చలన చిత్ర సీమలో ఎన్టీఆర్ కుటుంబానికి ఎనలేని గౌరవం ఉంది. ఆయన ఓ మహా వృక్షం ఆ చెట్టు కొమ్మలు వాటికి రెమ్మలు అన్నట్లు వారసత్వ హీరోలు వస్తూనే ఉన్నారు.  ఎన్టీఆర్ కొడుకుల్లో హరిక్రిష్ణ కొన్ని సినిమాలో హీరోగా వచ్చినా ముప్పయి సంవత్సరాల నుంచి ఎకగ్రీవంగా నటిస్తూ తెలుగు వారి గుండెల్లో సుస్థరమైన స్థానం సంపాదించుకున్నారు బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడిగా మాస్, యాక్షన్ సినిమాల్లో తన ప్రతిభ నిరూపించుకున్నారు. పౌరాణిక, సాంఘిక,జానపద చిత్రాల్లో తండ్రికి మల్లే నటించి తెలుగు ప్రేక్షకులు షబాష్ అనిపించుకున్నాడు బాలకృష్ణ. 


లెజెండ్ లో బాలకృష్ణ స్టిల్


బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ ఒక సెన్సేషన్ల బిగ్గెస్ బ్లాక్ బ్లస్టర్ గా మిగిలిపోయింది. అంతే కాదు ఈ సినిమా 400 రోజులు పూర్తి చేసుకుని రికార్డు స్థాపించింది. అయితే బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం 400రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ లో విజయోత్సవ వేడుక నిర్వహించనున్నారు . ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా హాజరు కానున్నాడు . బాలయ్య ,దర్శకులు బోయపాటి ,నిర్మాతలతో పాటు పలువురు నటీనటులు ,రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు . వంద రోజులు ఆడటమే గగనమై పోతున్న ఈ రోజుల్లో నాలుగు వందల రోజుల పాటు లెజెండ్ ఆడటం పెద్ద విశేషమే మరి .



మరింత సమాచారం తెలుసుకోండి: