తెలుగు సినిమాల గురించి మాత్రమే కాకుండి ఇండియన్ సినిమాలోని స్టోరి లైన్స్ లో దాదాపు 45 శాతం కొరియన్ సినిమాలే స్పూర్తి అని చెప్పాలి. స్పూర్తిగా తీసుకుంటే తప్పులేదు కాని, మక్కీ టు మక్కీ కాపీ కొట్టారంటే మాత్రం అడ్డంగా బుక్కవక తప్పదు. గతంలో వచ్చిన కొన్ని తెలుగు చిత్రాలు, కొరియన్ సినిమాలకు కాపీగా వచ్చి ప్రేక్షకుల ముందు దొరికిపోయారు.


ఇప్పుడు ఆ లిస్ట్ లో మన అల్లరి నరేష్ కూడ జాయిన్ అయ్యాడనే క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'జేమ్స్ బాండ్'. 'నేను కాదు నా పెళ్లాం' అనేది టాగ్ లైన్. ఈ మూవీతో సాయి కిశోర్‌ మచ్చ దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. అయితే ఈ మూవీ ఓ కొరియన్ చిత్రానికి కాపీ అనేది అధారాలతో తెలిసిపోతుంది.


కొరియా చిత్రం "My Wife Is A Gangster" 


ఈ చిత్రం కొరియా చిత్రం "My Wife Is A Gangster" ఆధారంగా రూపొందుతోందట. ఈ సినిమాలో ఓ డాన్ కు ఓ అమాయికుడు కి మధ్య జరిగే కామెడీ తో రన్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన దర్శకుడు మాట్లాడుతూ, ''మన్మథుడు'లో నాగార్జునలా కనిపించే కుర్రాడికి ఓ పవర్‌ ఫుల్‌ డాన్‌కీ మధ్య జరిగే సంఘర్షణ అందులోంచి పుట్టుకొచ్చే నవ్వులు అందరికీ నచ్చుతాయ''న్నారు దర్శకుడు.


'పోటుగాడు' తర్వాత నటిస్తోన్న ఈ చిత్రం తనకు పేరు తీసుకొస్తుందని హీరోయిన్ సాక్షి చౌదరి చెప్పింది. మొత్తంగా అల్లరి నరేష్ ఈ విధంగా చేయడంతో జేమ్స్ బాండ్ కాపీ చిత్రమా, కాదా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: