కాజల్ కి సంబంధించిన ఓ న్యూస్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే ఓ హాట్ ప్రోగ్రామ్ కి తను యాంకర్ గా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కాజల్ ఎప్పుడూ తను అందరికంటే అందగత్తె అనే ఫీలింగ్ లో ఉంటుంది. చాలా సందర్భాల్లో తను ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలలో తన అందం గురించి పదే పదే చెప్పుకొచ్చిన సందర్భాలు అనేకం.


కాజల్‌ తనొక అందమైన శిల్పంతో


ఇదిలా ఉంటే, తెలుగు లో ఓ చందమామ, ఓ మగధీర, ఓ బిజినెస్‌ మ్యాన్‌ చిత్రాల్లో కాజల్‌ అగర్వాల్‌ నటన ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా గూడుకట్టు కుంది. ఇక కోలీవుడ్‌ లో తొలి రోజుల్లో సరైన ఆదరణ లభించకపోయినా నాన్‌అవన్‌ అల్ల, తుపాకీ, జిల్లా చిత్రాలు ఈమెకు చక్కని విజయాలను కట్టబెట్టాయి. కాజల్‌ తనొక అందమైన శిల్పంతో పోల్చుకుంటున్నారు.


'గొప్పశిల్పులు రూపొందించిన చిత్రాలతో నేను ఒక అందమైన శిల్పం అయ్యాను. నేను సినీరంగ ప్రవేశం చేసినప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చాను. నేనూహించని విధంగా ఇన్నేళ్లుగా ప్రముఖ హీరోయిన్‌గా రాణిస్తున్నాను. నేను ఒక ప్రముఖనటినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను.' అంటూ చెప్పుకొచ్చింది.


కాజల్ ఇంతలా చెప్పుకోవటానికి కారణం ఏమిటంటే


కాజల్ ఇంతలా చెప్పుకోవటానికి కారణం ఏమిటంటే త్వరలో తను ఓ హాట్ ప్రొగ్రామ్ కి యాంకర్ గా మారనుందనే టాక్స్ బిటౌన్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ హిందీ ఛానల్ స్టార్ చేయబోతున్న అడల్డ్ రియాలిటి షోకి కాజల్ హోస్ట్ గా చేయటానికి అంగీకరించిందట. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అఫిషియల్ గా తెలియనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: