ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డంనిసంపాదించుకోవడం కోసం హీరోలు, హీరోయిన్స్ పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే వారు నిజానికి ఆఫర్స్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఒక్కసారిగా ఆఫర్స్ వచ్చి వరిస్తే ఎంతగా సంతోషపడతారో, అలాగే ఆఫర్స్ రాకపోయినా సరే అంతే విధంగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు.

అయితే ఈ స్టార్ డం కోసం ముఖ్యంగా హీరోలు చేసే జిమ్మిక్కులు కొన్నిసార్లు చాలా విషాదంగా ఉంటాయి. అటువంటిదే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విషయంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రిస్కులు చేయడంలో ముందుంటాడు. సినిమా కోసం రిస్కులు చేయడంలో విశాల్ కు మంచి రికార్డ్ ఉంది.

సాహసాలు చేయడంలో ఆరితేరిన ఈ పందెంకోడి.. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక యాక్షన్ స్టంట్ చేస్తూనే ఉన్నాడు. మొన్నామధ్య 'ఆంబల' మూవీ షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ.. ఇరవై అడుగుల ఎత్తు నుంచి పడ్డాడు.  ఆ ప్రమాదంలో విశాల్ రెండు కాళ్లకు గాయాలయ్యాయి. అయినా సరే మనోడు ఏమాత్రం తగ్గకుండా.. అదే దూకుడు చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈ రిస్కీ హీరోకు మరో సర్జరీ కూడా అయిందట.

తాజాగా జరిగిన దానితో విశాల్ దిగ్విజయంగా 75 సర్జరీలు పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేశాడట. సర్జరీ తర్వాత.. 'థాంక్స్ గాడ్.. సర్జరీతో కాపాడావు. ఇక మిగిలిన 25 కూడా అయితే సెంచరీ కొడతా' అని సరదాగా ట్వీట్ చేశాడట విశాల్.


మరింత సమాచారం తెలుసుకోండి: