నటసింహం బాలకృష్ణ నటించిన లయన్ సినిమా మే 1న విడుదల చేయాలనుకున్నా వీలు పడలేదు. ఈనెల 8న భారీ ఎత్తున రిలీజ్ కి రెడీ అయ్యింది లయన్ .  ఇప్పటికే లెజెండ్ 400 పూర్తి చేసుకొని బాలయ్య మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం చేయాలనే తలంపుతో నందమూరి హీరోలు వరుస విజయాలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పడు లయన్ హిట్ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరమే అవుతుంది.


లయన్ చిత్రంలో బాలకృష్ణ,రాధికా ఆప్టె, త్రిష


బాలయ్య పవర్ ఫుల్ సిబిఐ అధికారిగా నటించగా బాలయ్య సరసన త్రిష ,రాధికా ఆప్టే లు నటించారు . మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది . ఇప్పటివరకు తెలుగులో ఈ సంవత్సరం ఒక్క బ్లాక్ బస్టర్ కూడా రాలేదు పైగా వేసవి కూడా అయిపోతున్నందున లయన్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని బాలయ్య అభిమానులు విశ్వసిస్తున్నారు . లయన్ చిత్రంలో యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువే ఉండటంతో చిత్రానికి ''యు /ఏ '' సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. మరి బాలయ్య 8 న థియేటర్లలో సందడి చేయాలని నందమూరి అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: