టైమ్స్ పత్రిక జాతీయస్థాయిలో నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2014’ లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో ప్రకటించిన మొదటి 50 స్థానాలలో సన్నిలియోన్ ప్రధమస్దానంలో ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటి వరకు పోల్ అయిన 20.3 లక్షల ఓటర్లు ఈ ఆన్ లైన్ ఓట్లలో ఆమెను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సింహాసనం పై టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులు కూర్చో పెట్టడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలన వార్తగా మారింది. 

ఈ వార్త పై స్పందిస్తూ సన్నీ తాను జీవితంలో గెలిచాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోర్న్ స్టార్ గా జీవితాన్ని ప్రారంభించిన సన్నీకి జీవితంలో ఇది ఊహించని అదృష్టం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ దీపిక పదుకొనెను రెండవ స్థానంలోకి నెట్టివేసి సన్నీ ఈ అద్భుతాన్ని సాధించింది. 

టైమ్స్ పత్రిక ప్రకటించిన 50 స్థానాలలో మన టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సమంత-కాజల్ లకు స్థానం దక్కక పోవడం మరో ట్విస్ట్. ఈ వార్తలు ఇలా ఉండగా సంచలన తార సన్నీలియోన్ వెండితెరపై నగ్నంగా నటింప చేయడానికి బేరాలాడుతున్నారు. 

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ‘XXX’ సినిమాలో సన్నీ చేత ఒక సన్నివేశంలో నగ్నంగా నటింప చేయడానికి 5 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్లుఫా వార్తలు వస్తున్నాయి. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గౌరవాన్ని పొందిన సన్నీకి మాత్రం మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఆమె భర్త డ్యానియల్ ఆమె మనసులో శాస్వితం అంటూ కామెంట్ చేసింది. ఇండియా నుండి ఆమెను బహిష్కరించాలి అని కొందరు ఉద్యమాలు చేస్తున్న నేపధ్యంలో ఆమెను అదే ఇండియన్స్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ సింహాసనంపై కూర్చో పెట్టడం ఆశ్చర్యకరం..  


మరింత సమాచారం తెలుసుకోండి: