రానా, త్రిష సినిమా కెరీర్ బిగినింగ్ ఒకరినొకరు విడిచి ఉండే వారు కాదు. ఏ పార్టీలో చూసిన ఈ జంట కనబడేది.  తర్వాత ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్త వినిపించింది. ఈ ప్రేమ… పెళ్లి వరకూ దారి తీసే అవకాశం ఉందనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ, హఠాత్తుగా ఈ ఇద్దరూ బ్రేకప్ అయ్యారనే వార్త వినిపించింది. తర్వాత కోలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత, వ్యాపర వేత్త అయిన  వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి నిశ్చితార్థం అయ్యిదే కాని ఎవరి వారే ఎమునా తీరే అన్నట్లు ఉన్నారు. ఒకదశలో త్రిశ, వరుణ్ ల పెళ్లి క్యాన్సల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మళ్లీ రాణా, త్రిష క్లోజ్‌ అయిపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్విట్టర్‌లో ఒకర్నొకరు అన్‌ ఫాలో కూడా చేసిన ఈ ఇద్దరిలో ఇప్పుడు రాణా మళ్లీ త్రిషని ఫాలో అవుతున్నాడు.   


ఫ్రెండ్స్ తో రానా, త్రిష


నిన్న త్రిష పుట్టిన రోజు. ఈ సందర్భంగా   సందర్భంగా త్రిషకు శుభాకాంక్షలు చెప్పినవాళ్లల్లో రానా కూడా ఉన్నాడు. ‘హ్యాపీ బర్త్ డే బెస్టస్ట్.. హావ్ ఎ ఫెంటాస్టిక్ ఇయర్’ అని ట్విట్టర్ ద్వారా త్రిషకు రానా విషెస్ చెప్పాడు. అందుకు త్రిష ఏమన్నదో తెలుసా? ‘థ్యాంక్యూ సైకో’ అంటూ రిప్లై ఇచ్చిందట. అదేంటి త్రిష అంతమాట అన్నదేంటీ  అనుకుంటున్నారా? ఇది కోపంగా కాదు.. ప్రేమగా ప్రేమగా రిప్లై ఇచ్చిందట. రానా, త్రిష మధ్య మాటలు లేవని చాలామంది ఊహించారు. మరి వీరిమధ్య స్నేహం చిగురించి అది ఎంత దూరం వెళుతుందో వేచి చూడాల్సిందే..


ఓ ఫంక్షన్లో రానా, త్రిష



మరింత సమాచారం తెలుసుకోండి: