ప్రస్తుత కాలంలో సమంత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువుగా నటించడం లేదు. దీనిపై వస్తున్న వార్తలపై రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కొంతకాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటోంది సమంతా. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క తెలుగు చిత్రానికి అంగీకారం తెలుపలేదు.

తమిళంలో మాత్రం వరుసగా సినిమాల్ని అంగీకరిస్తూ జోరు మీదుంది. ఈ సుందరి పోకడలు చూస్తుంటే తెలుగుకు దూరమైనట్లుగానే కనిపిస్తోంది. ఇదే విషయం గురించి సమంతాను ప్రశ్నించగా....తెలుగు సినిమాలకు తాను ఎప్పటికీ దూరం కానని సమాధానం చెబుతోంది. ఆమె మాట్లాడుతూ తెలుగు చిత్రసీమ ద్వారానే కథానాయికగా అరంగేట్రం చేశాను.

టాలీవుడ్ నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, హోదాను తెచ్చిపెట్టింది. అందుకే తెలుగు పరిశ్రమ అంటే నాకు గౌరవం, అభిమానం. తెలుగు చిత్రాలకు నేను దూరమయ్యానని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. నా మనసుకు నచ్చిన మంచి కథ ఎదురుకాకపోవటంతో తెలుగు సినిమాలకు విరామం వచ్చింది.

తమిళ, మలయాళం...ఏ భాషలో నటించినా తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యతనిస్తాను. భవిష్యత్‌లో ఏడాదికి రెండు తెలుగు సినిమాలు చేసేలా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాను. త్వరలో ఓ మంచి కథతో ఇక్కడి ప్రేక్షకుల ముందుకొస్తాను అని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో 10 ఎండ్రాదుకుళ్ల, 24తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది సమంతా

మరింత సమాచారం తెలుసుకోండి: