పెదవులపై చిన్న పుట్టమచ్చ, అందం, అభినయానికి ప్రతి రూపం.. వెండి తెరపై ఓ వెలుగు వెలిగి వేలాది మంది ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర ను వేసుకున్న వెన్నెల దీపం జయప్రద. బాల చందర్ దర్శకత్వంలో అంతులేని కథ, కే. విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ వంటి చిత్రాలు ఆమె సినీ జీవితానికి ఎర్ర తివాచి పరిచి స్వాగతం పలికాయి. జయప్రద అసలు పేరు లలితా రాణి. 1959 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించారు జయప్రద. ఆమె చిన్నతనంలోనే నాణ్యంలో శిక్షణ పొందారు. అలా చిన్నతనంలో నేర్చుకున్న నాట్యమే ఆమెకు సినిమాలలో అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆమె తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం భూమి కోసం.తెలుగు , హిందీ, తమిళ వంటి భాషలలో ఆమె ప్రముఖ హీరోలందరితో కలిసి ఆడిపాడింది.

జయప్రద వయసులో ఉన్నప్పటి చిత్రం



జయప్రద దాదాపు 300 పైగా చిత్రాలలో నటించారు. అందం అవకాశాలను తెచ్చిపెడితే, అభినయం అవార్డులను తెచ్చిపెడుతుందనే మాట జయప్రద విషయంలో అక్షరాల నిజమైంది. కళా సరస్వతి.. కిన్నెరసాని.. రాజీవ్ గాంధీ .. నర్గీస్ దత్ .. శకుంతలా కళారత్నం వంటి అవార్డులు జయప్రద అభినయానికి నిలువెత్తగు నిదర్శనంగా నిలుస్తాయి.మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ మూవీలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం 5 పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తనలోని టాలెంట్ ఏమాత్రం తగ్గలేందంటున్న జయప్రద.‘థ్రిల్లరు’ లో నటించడంపై జయప్రద స్పందిస్తూ ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో గ్లామరస్గా, వైవిధ్యంగా ఉంటుందని తెలిపారు. ఇటువంటి రోల్ను గతంలో తాను ఎప్పడు చేయలేదని చెప్పారు. ఇలాంటి ఈ పాత్రను చేయడానికి ఒప్పుకోవడం తనపరంగా చాల సాహసోపేత నిర్ణయమని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: