వాళ్లిద్దరూ ఎలాంటి స్నేహితులో తెలియదుగానీ... వాళ్లిద్దరితోనూ మరో గుమ్మడికి మాంచి స్నేహం ఉందట. దేశముదురులో యువకుల మనసులను కొల్లగొట్టిన హన్సిక ఇప్పుడు తమిళనాట నంబర్ వన్ స్థాయిలో ఉంది. సుమారు ఎనిమిది సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తమిళులు ఆమెను చిట్టి ఖుష్బూ అంటున్నారంటేనే... ఆమెను ఎంత ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంత బిజీగా ఉంటే మరి తోటి హీరోయిన్లు అసూయగా ఫీలవ్వరా అంటే... అస్సలు కారు అంటోంది హన్సిక. ఎందుకంటే... వాళ్లంతా తనకు స్నేహితులేనట. ముఖ్యంగా తమన్నా, కాజల్ లతో మంచి స్నేహం ఉందట. వృత్తిగత విషయాలేకాదు, వ్యక్తిగత విషయాలను కూడా హన్సిక వీళ్లిద్దరితో పంచుకుంటుందట. తమన్నా అయితే కనీసం వారానికోసారి ఫోన్ చేసి గంటసేపయినా మాట్లాడుతుందట. మంచి స్నేహితులే అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: