తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేశావే అంటు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన ముద్దుగుమ్మ సమంత. అయితే సమంత తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత  ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ సినిమా రంగంలో తన అందాలతో అందరి మనుసు దొచుకుంది. తెలుగులో ‘అత్తారింటికి దారేది’ ‘ఈగ’ ‘బృందావనం’ ‘దూకుడు’ ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమాలు ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతానికి తెలుగులో అంతగా చాన్సులు రావడం లేదు. అందుకే తమిళ రంగం వైను దృష్టి పెట్టింది.


అందాల రాశి సమంత


అయితే అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఏ హీరో అయినా పరవాలేదు అంటుంది. అంతే కాదు ఆ మధ్య ‘అల్లుడు శీను’ లో కుర్రహీరోతో నటించింది.  తాజాగా   ఓ తమిళ హాస్య నటుడు శివ కార్తికేయన్  తో నటించడానికి ఒప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి . తెలుగులో ఇటీవలి కాలం వరకు నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సమంత ఒక హాస్య నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తుంటే అతడి సరసన నటించడం ఏంటని ? దీంతో సమంత రేంజ్ పడిపోయిందా అన్న చర్చ జరుగుతోంది . అయితే తను మాత్రం  మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అని అనుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: