భారత దేశంలో హాట్ టాపిక్ గా మారిన సల్మాన్ ఖాన్ ఉదంతం ఇప్పుడు కాస్త రిలీఫ్ గా మారింది.   హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్షపడ్డ హీరో సల్మాన్ ఖాన్ స్వల్ప ఊరట లభించింది. 13 ఏళ్లుగా విచారణ సాగుతున్న హిట్ రన్ అండ్ కేసులో సల్మాన్ ను ముంబై స్పెషల్ కోర్టు దోషిగా నిర్దారించింది. కారు నడిపే సమయంలో మద్యం సేవించి ఉన్నాడని కోర్టు తేల్చింది.  ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని కోర్టు తెలిపింది. సల్మాన్ పై 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు దోషిగా ప్రకటించింది. వాదోపవాదాల అనంతరం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.


విషాద వదనంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్

Bombay high court gives interim bail to salman khan

కాగా సల్మాన్ ఖాన్‌కు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం మధ్యాహ్నం కోర్టు తుది తీర్పు వెల్లడించిన వెంటనే సల్మాన్ ఖాన్ తరుపు నాయ్యవాదులు, కుటుంబ సభ్యులు బెయిల్ కోసం బాంబే హైకోర్టు ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్ ను హైకోర్టు వెంటనే విచారణకు స్వీకరించింది. సల్మాన్ తరుపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. ఆయన వాదన ప్రకారం ప్రమాదంతో మరణించిన బాధిత కుటుంబ సభ్యులతో పాటు గాయాలపాలైన నలుగురికి ఇప్పటికే భారీ మొత్తంలో పరిహారం ఇచ్చామన్నారు. ప్రమాదానికి తనకు సంబంధం లేకున్నా.. తనపై కావాలని కేసును బనాయించారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వాదనలను విన్న బాంబే హైకోర్టు సల్మాన్ ఖాన్ కు రెండు రోజుల పాటు అనగా శుక్రవారం వరకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  అయితే మొదట సల్మాన్ ఖాన్ ని పోలీసు కస్టడికి తరలించాల్సిదే కాని   బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ రాత్రి సల్మాన్ ఖాన్ జైలుకు కూడా వెళ్లనవసరం లేకుండా పోయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: