ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమా వలన ఆ సెక్సీ భామకు దక్కిన గుర్తింపు చాలా తక్కువ. కానీ ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతున్న (లేదా సహజీవనం సాగిస్తున్న) చిన్న నిర్మాత ఎర్రచందనం స్మగ్లర్‌గా అరెస్టు కాగానే.. ఆమెకు ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగిపోయింది. అయితే ఇప్పుడామె.. తనకున్న ఆస్తులు సమస్తం.. తన కష్టార్జితం అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు. 


సెక్సీ హీరోయిన్‌ నీతూ అగర్వాల్‌ అంటే టాలీవుడ్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలియని వారు లేరు. ఇది ఆమెకు తాను చేసిన సినిమా ద్వారా లభించిన కీర్తి కాదు. కాకపోతే.. అదే సినిమా నిర్మాతతో ఆతర్వాత సహజీవనం ప్రారంభించిన ఆమె తర్వాత పెళ్లి కూడా అయిందంటున్నారు. ఏదైతేనేం.. మొత్తానికి ఆ నిర్మాత మస్తాన్‌వలి ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్‌గా దొరికిపోయారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన అనేక లావాదేవీలతో నీతూ అగర్వాల్‌కు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఆమెను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నీతూ అగర్వాల్‌ మాత్రం తాను అమాయకురాలిని అంటున్నారు. 


నిజానికి ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా సంపాదించిన అక్రమార్జనను మస్తాన్‌వలి ఆమె పేరుతో ఆస్తులు కొన్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. నీతూ మాత్రం.. తనకు ఉన్న ఆస్తులన్నీ తన కష్టార్జితంతో తన సినిమాల రెమ్యునరేషన్‌తో కొన్నవేనని.. వాటిలో మస్తాన్‌వలి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆమె అంటున్నారు. తనకు తెలియకుండా తన ఏటీఎం కార్డు మస్తాన్‌వలి వాడుకోవడం వలన స్మగ్లింగ్‌ లావాదేవీలతో తన ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారని ఆమె వ్యాఖ్య! మస్తాన్‌ను అడ్డుపెట్టుకుని తాను ఎవ్వరినీ బెదిరించలేదని, ఆయన తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె అంటున్నారు. ఇంతా కలిపి ఆమె చేసినవి ఊరూపేరూ లేని సినిమాలు కాగా.. ఆ సంపాదనతో ఇంత ఆస్తులెలా కొన్నారనేది ప్రశ్న. 


మొత్తానికి బెయిల్‌పై బయటఉన్న నీతూ అగర్వాల్‌ ఇక మస్తాన్‌వలి తో తెగతెంపులు చేసుకుని.. దక్కినంత వరకు తన ఆస్తి అనుకుని సేఫ్టీజోన్‌లోకి వెళ్లదలచుకుంటున్నట్లుగా  ఆమె మాటలు సంకేతాలిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: