సత్యదేవ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ సినిమా విడుదల విషయంలో కాస్త ముందూ వెనుక అవుతుంది. మొత్తానికి ఈ నెల 14 న సినిమా విడుదల చేయడానికి సిద్దం అయ్యారు. అయితే ఈ సినిమా ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తూ వస్తుంది. ఇప్పటికే ‘లెజెండ్’ 400 రోజలు పూర్తి చేసుకొని మొన్నామధ్య కర్నూల్ విజయోత్సవ కార్యక్రమం చేశారు. మరి బాలయ్య తర్వాత వచ్చే సినిమాపై ప్రేక్షకులకు హై ఎక్స్ పెక్టేషన్ ఉంటుంది. కానీ లయన్ సినిమా పై రోజుకో రూమర్ వస్తుంది.    ఈ సినిమా కథ లీకయింది అంటూ సోషల్ మీడియా లో తెగ న్యూస్ లు వస్తున్నాయి.


లయన్ ఫ్యాన్స్ పోస్టర్


అసలు కథ ఏమిటా అని అంటే .. ఈ సినిమాలో బాలయ్య అమ్నిశియ పేషెంట్ అని రెండేళ్ళు కోమాలో ఉన్న ఓ వ్యక్తి తన గురించి తెలుసుకుని , తను గతం లో సి బి ఐ అధికారి అని తన  ఈ పరిస్తితికి కారణం అయిన వారి అంతు చూడడమే ఈ కథ అని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో కాదో తెలియదు కానీ బాలకృష్ణ అభిమానులు మటుకు ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను రుద్రపాటి రమణ రావు నిర్మిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: