బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తీసిన ‘సింహ’, ‘లెజెండ్’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి, అంతేనా ఇక లెజెండ్ సినిమా అయితే తెలుగు చలన చిత్ర రంగంలో  రికార్డుల మోత మోగిస్తుంది. 400 రోజులు చిత్ర ప్రదర్శన జరిగిన సందర్భంగా ఈ మధ్య కర్నూల్ లో పెద్ద ఫంక్షన్ కూడా జరిపారు. తాజాగా సత్యదేవ్ దర్శకత్వంలో రూపొందించిన ‘లయన్’ సినిమా మటుకు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తదుపరి చిత్రం ఎలాగైనా సరే హిట్ చెయ్యాలన్న కసితో ఉన్నారు బాలయ్య. అందుకే తదుపరి  సినిమాలో వచ్చే క్యారెక్టర్ పరంగా తన శరీరాన్ని చక్కగా మరల్చుకోవాలని జిమ్ లో చెమటోడ్చి కష్టపడుతున్నాడు.

లయన్ మూవీ పోస్టర్


50 ప్లస్ ఏజిలో కూడా బాలయ్య ముఖంలో తేజస్సు తగ్గలేదు.. ఇక ఆయన పవర్, డైలాగ్ డెలివరీ ఏవిధంగా ఉంటుందో చెప్పనక్కరలేదు. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు . ఇక ఈ కొత్త చిత్రం ఈనెల 29న ప్రారంభం కానుంది .  మరి తన తదుపరి చిత్రంలో బాలకృష్ణ న్యూ లుక్స్ తో కనిపిస్తాడా అన్నది వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: