తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో పూరీ జగన్నాధ్ ఒకరు. ఈ మధ్య వచ్చిన టెంపర్ సినిమాలో ఆయన ఎన్టీఆర్ ని రెండు డిఫరెండ్ షేడ్స్ లో చూపించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. అంతే కాదు చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదరు చూస్తున్న ఎన్టీఆర్ కి సూపర్ డూపర్ హిట్ సినిమా అందించాడు. అయితే ఇదే కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా గురించి కొన్ని నిజాలు చెప్పాడు పూరి.

గప్ చుప్ ప్రోగ్రామ్ లో నిహారిక


మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హోస్ట్ చేస్తున్న కార్యక్రమం ఇటీవల జెమిని టివి లో ప్రారంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి ''గప్ శప్ '' అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే సినీ ప్రముఖులతో ప్రోగ్రామ్ చేసిన నిహారిక ఈ మధ్య  జగన్నాద్ -పూరి తనయుడు ఆకాష్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా పూరి తన మనసులో మాటలు చెప్పాడు. ''ఆంధ్రావాలా ' ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని పొందింది, అయితే ఆ సినిమా నాకు అస్సలు నచ్చలేదని ,నేను తీసిన చెత్త సినిమాల్లో అదొకటని అన్నాడు దర్శకులు పూరి జగన్నాద్. బహుషా అదే కసితో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తీసిన మరో సినిమా ‘టెంపర్’ సూపర్ హిట్ అయ్యాక సంతోషించారు. 


ఆంధ్రవాలా సినిమా పోస్టర్



మరింత సమాచారం తెలుసుకోండి: