భారత దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ముంబాయి, ఢిల్లీ  ఈ మధ్య హైదరాబాద్ లో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎవరినైనా బెదిరించాలంటే ఇదివరకు కత్తులు, చిన్నగడ్డళ్లు,  లాంటి వి  వాడేవారు ఇప్పుడు ఏకంగా గన్ లు చూపించి భెదిరిస్తున్నారు. తాజాగా ముంబాయి సూపర్ స్టార్ అమితాబచ్చన్ షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో కాల్పుల మోత మోగే సరికి ఒక్కసారిగా కలకలం రేగింది. ముంబై చిత్రనగరి వద్ద ఈ కాల్పులు జరిగాయి.సెక్యూరిటీ సంస్థ యజమానిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారని సమాచారం.


అమితాబచ్చన్ షూటింగ్ వద్ద జరిగిన కాల్పులు పరిశీలిస్తున్న పోలీసులు

'Gang War', Tweeted Big B About Film City Shooting. Wrong, Says Sena
అయితే ఈ సంఘటన వ్యక్తిగత కారణాల వల్లనో లేక ఎవరైనా బెదిరించడానికి జరిపిన కాల్పులో కానీ అక్కడ మాత్రం పెద్ద హంగామా జరిగింది. కాగా అమితాబచ్చన్ మాట్లాడుతూ తను ఉన్న చోటకు ఇరవై అడుగుల దూరంలో కాల్పుల మోత వినిపించిందని చెప్పారు. ఈ ఘటనతో అక్కడ అంతా గందరగోళం ఏర్పడింది. అదృష్టవశాత్తు అమితాబ్ బచ్చన్ తదితరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: