ఈ సంవత్సరపు రియల్ హిట్ గా టాలీవుడ్ లో సంచలనాన్ని క్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్ పటాస్ హిట్ రవితేజ ‘కిక్ 2’ కు సమస్యలు తెచ్చి పెట్టింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ‘పటాస్’ సినిమా ఊహించని ఘనవిజయంతో కళ్యాణ్ రామ్ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ‘కిక్ 2’ సమస్యగా మారాయి అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

ఇప్పటికే నిర్మాణం పూర్తి అయి ఆడియో కూడా విడుదల అయిన ‘కిక్ 2’ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయాలని కళ్యాణ్ రామ్ భావించాడు ఆనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు బయ్యర్ల నుండి ఏర్పడిన సమస్యలతో ఈ సినిమా విడుదలను జూన్ 12కి వాయిదా వేసారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి కూడా ఈ సినిమా విడుదల కావడం కష్టమే అంటున్నారు.

ఈ సమ్మర్ కు విడుదల అయిన భారీ సినిమాలు అన్నీ అంచనాలను అందుకోలేక బయ్యర్లకు నష్టాలను మిగల్చడంతో ‘కిక్ 2’ విషయంలో కళ్యాణ్ రామ్ అంచనాలకు భిన్నంగా ఈ పరిస్థుతులు ఏర్పడ్డాయని టాక్.  ‘పటాస్’ హిట్‌తో రిలాక్స్ అయిన కళ్యాణ్ రామ్ ను ‘కిక్ 2’ స్టైలిష్ గా బడ్జెట్ పెంచి మరింత క్వాలిటీగా చేద్దామని దర్శకుడు సురేందర్ రెడ్డి చేసిన ప్రయత్నంతో రవితేజ రేంజ్‌ను మించి 35 కోట్ల వరకూ ఈ సినిమా బడ్జెట్ పెరిగి పోవడంతో అన్ని ఏరియాలు, శాటిలైట్ వగైరా కలిపితే 30 కోట్ల బిజినెస్ కూడా జరగని 'కిక్ 2'  డెఫిషిట్‌తోనే రిలీజ్ అవుతోందని టాక్. 

అయితే రిలీజ్ కు ఇబ్బంది లేకున్నా బయ్యర్స్, ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలంటే 'కిక్ 2' సూపర్ హిట్ అయి 40 కోట్లయినా కలెక్ట్ చేయాలని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే సమ్మర్ సీజన్ పూర్తి అయ్యాక వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు అంత కిక్ ఇస్తుందా? అనే అనుమానాలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: