సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి కళ్ళు బాహుబలి మూవీ మీదే ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రోజురోజుకూ రాజమౌళి క్రేజ్ పెరిగిపోతూ వస్తుంది. ఒక సినిమాకు విడుదలకు ముందే ఎంతటి హైప్ తీసుకురావచ్చో తెలుసుకోవాలంటే రాజమౌళికి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదనే సందేహం వస్తుంది.

ఈ సినిమా పాత్రల పోస్టర్ లు పూర్తవడంతో ఇప్పుడు అందరి కళ్ళూ త్వరలో విడుదలకానున్న ఆడియో లాంచ్ పై పడనున్నాయి. ఈ వేడుకకి సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే సౌత్ ఇండియాకి సంబంధించిన ప్రముఖ స్టార్లంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు.

దాదాపు మూయిడేళ్ళుగా షూటింగ్ సాగుతున్న చిత్రం ట్రైలర్ ఎలా వుంటుందా అని అందరు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బిటౌన్ టాప్ స్టార్స్ సైతం బాహుబలి ఆడియో లాంచ్ కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్ బాహుబలికి ఆడియో ఫంక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: