బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల జోరు ఇంకా తగ్గలేదు. తాజాగా క్రికెటర్ అజహరుద్దీన్ జీవిత చరిత్రని సిల్వర్ స్ర్కీన్ పై ఆవిష్కరిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల హవా ఎక్కువగానే వుంది. ఈనేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.

ఆ కోవలో తాజాగా ఇండియన్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. ఇమ్రాన్ హష్మి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంచలన నిర్మాత ఏక్తాకపూర్ నిర్మిస్తోంది. ఆంటోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.

అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్‌గా ప్రాచీదేశాయ్, రెండో భార్య సంగీత బిజిలానీగా నర్గిస్ ఫక్రి నటిస్తున్నారు. అయితే గతంలో అజహర్ మూవీపై అజహరుద్దీన్ అభ్యంతరం లేదంటూ పూర్తి వివరణ ఇచ్చుకున్నాడు. ఆ వివరాలను ఓసారి చూస్తే..తన జీవితంలో మూడు ముఖ్య ఘట్టాలను తెరపై ఆవిష్కరించినా అభ్యంతరం లేదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు.

ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజహర్' సినిమాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్, పెళ్లి ఘట్టాలు చూపించారు. అయితే వీటిని చూపించడంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అజహర్ పేర్కొన్నాడు. తన జీవితంలోని మూడు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాలో తెరక్కించారని తెలిపాడు. ఈ సినిమా స్ర్కిప్ట్ చదివానని చెప్పాడు.

టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన 'అజహర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం విడుదల చేశారు. అజహరుద్దీన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మి నటించాడు. ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: