దర్శకుడు పూరి జగన్నాథ్ కు టాప్ హీరోలందరితో సన్నిహితంగా ఉండటమే కాకుండా ఇంచుమించు అందరి టాప్ హీరోలతోనూ సినిమాలు చేసిన రికార్డు ఉంది. ఈ మధ్య ఈ క్రేజీ డైరెక్టర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోలను తాను దర్శకత్వం వహించే సినిమాలలో నటించడానికి ఒప్పించే విధంగా ఎటువంటి ట్రిక్స్ చేస్తాడో సరదాగా మీడియాకు లీక్ చేసాడు.

మెగా స్టార్ చిరంజీవికి కథ చెప్పేడప్పుడు ఫ్యామిలీ  ఎమోషన్స్ సెంటిమెంట్ సీన్స్ బాగా ఉండేలా తాను జాగ్రత్త పడతానని అటువంటి సీన్స్ ను చిరంజీవికి చెపుతున్నప్పుడు జాగ్రత్తగా చెప్ప గలిగితే ఆ సీన్స్ లో చిరంజీవి ఇన్వాల్వ్ అవడమే కాకుండా ఒకొక్కసారి చిరంజీవి ఆ పాత్రలోకి ప్రవేసించి కంటి వెంట నీరు కూడ పెట్టుకుంటాడని చిరంజీవి లాంటి సున్నితమైన మనస్తత్వం ఉన్న హీరోను తాను ఇప్పటి వరకు చూడలేదు  అని అన్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ కు సినిమా కథలో గన్స్ ఉంటే తెగ ఇష్టపడతాడని ఎవరైనా దర్శకుడు పవన్ తో కౌబాయ్ సినిమా తీస్తే తనకు చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అదేవిధంగా మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ కు ప్రేమ కథలన్నా ఫ్యామిలీ కథలతో ఉన్న కుటుంబ కథా చిత్రాలు అన్నా చాల ఇష్టం అని చెప్పాడు. 

హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ  ప్రభాస్ కు వార్ సినిమాలు కన్నా వినోదం ఉన్న సినిమాలు ఇష్టం అంటూ ‘బాహుబలి’ హీరో పై కామెంట్ చేసాడు. అయితే రవితేజ మాత్రం అతడు నటించే సినిమా పాత్రలలో ఎనర్జీ లేకపోతే ఒప్పుకోడు అని ఎట్టి పరిస్తుతులలోను రవితేజాను డల్ గా ఉండే పాత్రలలో నటింప చేయడం ఏ దర్శకుడికి సాధ్యంకాని పని అంటూ కామెంట్ చేసాడు. అయితే తాను దర్శకత్వం వహించి తనకు సన్నిహితులైన జూనియర్, రామ్ చరణ్ ల గురించి ఏ కామెంట్స్ చేయక పోవడంతో వారి మనస్తత్వం ఇంకా పూరీకి కూడ అర్ధం కాలేదేమో అని అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: