అల్లువారి కుటుంబం నుండి వచ్చినా అల్లు శిరీష్ కు అదృష్టం లేకపోవడంతో క్రేజీ యంగ్ హీరో అవుదాము అనుకున్న కోరిక పగటి కలగానే మిగిలి పోయింది. అయినా తన పట్టుదల వీడకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూ శిరీష్ హీరోగా నిలదోక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఈనేపధ్యంలో అల్లు శిరిష్ తన అన్న అల్ల అర్జున్ నటించిన ‘దేశముదురు’ సినిమా పై వింత వ్యాఖ్యలు చేసాడు.  ‘దేశ ముదురు సినిమాలో మా అన్నయ్య అల్లు అర్జున్‌ని చూసినప్పటి నుంచీ నాకు అలాగే హీరో కావాలని వుండేది. ఇప్పుడు క్రమక్రమంగా ఆ లుక్ వచ్చేస్తోంది’ అంటూ జిమ్ లో కష్ట పడుతూ పెంచుతున్న తన సిక్స్ ప్యాక్ అవతారాన్ని తన అభిమానులకు పరిచియం చేస్తూ ఆఫోటోలను తన ట్విట్టర్ లో పెట్టాడు.

తెలుగు హీరోల్లో ముందుగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో దర్శనమిచ్చింది అల్లు అర్జున్‌. ‘దేశముదురు’ సినిమాలో సిక్స్ ప్యాక్  లుక్ తో  కనిపించిన తరువాత బన్నీని అనుసరిస్తూ చాలామంది యంగ్ హీరోలు ఈ సిక్స్ ప్యాక్ ను అనుసరించారు. అప్పుడు అన్నయ్యని చూసి స్ఫూర్తి పొందిన అల్లు శిరీష్‌ అప్పట్నుంచీ సిక్స్‌ ప్యాక్‌ కోసం కష్టపడుతూనే ఉన్న ఇంకా పూర్తి లక్ష్యం చేరుకోలేదు అని అంటున్నాడు. అంతేకాదు తన అన్నయ్య బన్నీ  హీరో కాక ముందు తనకి హీరో కావాలనే ఐడియా కూడా లేదని కేవలం నిర్మాతగా ఉందామని అనుకున్ననని అంటూ బన్నీ సినిమాలలోకి రావడంతో తానుకూడ  తన అన్నయ్యని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని హీరో అయ్యాను అంటున్నాడు.

అయితే ఇప్పటివరకు  సక్సెస్‌ లేక పోయినా తన ప్రయత్నాలు మానకుండా ఎలాగైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనే కసితో ఇప్పుడు బాడీ మీద వర్క్‌ చేస్తోన్న శిరీష్‌ అతి త్వరలో తన సిక్స్‌ ప్యాక్‌ని వెండితెరపై చూపించబోతున్నాడు. పరశురామ్‌ డైరెక్షన్‌లో రూపొందే చిత్రంతో శిరీష్‌ ఇంకోసారి హీరోగా అదృష్టం పరీక్షించుకుంటాడు అని తెలుస్తోంది.  కనీసం ఈ ప్రయత్నమైనా శిరీష్ కు కలిసి వస్తుందేమో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: