బాలకృష్ణ సినిమాలు అంటేనే పంచ్ డైలాగ్స్ బాలయ్య నోటి వెంట పంచ్ డైలాగ్స్ పడకపోతే ఆ సినిమాలో ఎదో వెలితి కనిపిస్తుంది. అటువంటి సాంప్రదాయానికి భిన్నంగా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బాలకృష్ణ 99వ సినిమాలో పంచ్ డైలాగ్స్ కు ప్రాధాన్యత ఇవ్వద్దని ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్స్ కు స్వయంగా బాలకృష్ణ సలహా ఇచ్చాడని టాక్. 

‘లౌక్యం’ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొత్త రకమైన బాలయ్యను చూపెడుతూ  ఈ మూవీలో ఎంటర్‌టైన్మెంట్, యాక్షన్ పార్ట్స్ పుష్కలంగా ఉండేడట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కోన వెంకట్, గోపీ మోహన్ తో పాటు మొత్తం ఐదుగురు రచయితలు ఈ సినిమా స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న నేపధ్యంలో ముహూర్త బలం రీత్యా ఈ సినిమా షూటింగ్ ను మే 29న ప్రారంభించడానికి బాలయ్య తన అంగీకారాన్ని తెలిపాడు అని వార్తలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్స్  ఉంటున్న నేపధ్యంలో ఒక హీరోయిన్ పాత్రకు  అంజలి కన్ఫర్మ్ అయిందని ఈ మూవీ కోసం ఆమె సుమారు10 కిలోల బరువు తగ్గి స్లిమ్ లుక్‌తో కనిపించనుందని అంటున్నారు. 

మరో హీరోయిన్‌గా హన్సిక లేదా ప్రణీత, తాప్సీలలో ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ సమాచారం. ‘లయన్’ చెప్పిన గుణపాఠంతో బాలకృష్ణ ఆలోచనలలో మార్పు రావడమే కాకుండా ఏకంగా పంచ్ డైలాగ్స్ కు బాలయ్య దూరమైతే బాలకృష్ణ సినిమాలాకు గుండే కాయలాoటి మాస్ ప్రేక్షకులుఅంగీకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: