బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ కు ఒక సెలెబ్రెటీ స్టేటస్ ను ఇచ్చింది ఎన్ఆర్ఐ లు అన్న విషయం వాస్తవం. సంపూ నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా విజయవంతం చేయడంలో ఎన్ఆర్ఐ ప్రేక్షకులు అందించిన సహకారంతోనే మొట్టమొదటి సినిమాతో సంపూ బర్నింగ్ స్టార్ గా మారిపోయాడు. అయితే అటువంటి సంపూ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో ఎన్ఆర్ఐ గా నటిస్తూ ఆ సినిమా టీజర్ లో వాడిన ఘాటైన డైలాగ్ ఎన్ఆర్ఐ లకు కోపం తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

గత వారం ఛార్మీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘జ్యోతిలక్ష్మి’ టీజర్ లో సంపూ అమెరికా నుండి వచ్చిన ఎన్ఆర్ఐ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో సెక్స్ వర్కర్ గా నటిస్తున్న ఛార్మీ పై మోజు కూడ పెంచుకుంటాడు. అయితే ఛార్మీ సంపూ పట్ల పెద్ద ఆ శక్తి కనపరచక పోవడంతో ఆమెను బెదిరిస్తూ ‘జ్యోతిలక్ష్మి అమెరికా రావే చూసుకుందాం’ అంటూ బెదిరిస్తాడు.

అయితే ఈ డైలాగ్ చాలామంది అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ లను బాధ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక సెక్స్ వర్కర్ కోసం వీధి రౌడీలా అసభ్యకరమైన మాటలు గౌరవ ప్రదంగా అమెరికాలో జీవించే ఎన్ఆర్ఐ లు ఇలా సంపూ బాబులా అంటారా? అంటూ సంపూ పాత్ర పై కోపం పెంచుకున్నట్లు టాక్.

అమెరికాలో చట్టబద్ధమైన స్ట్రిప్ డాన్స్ బార్స్ ఇంకా ఇలాంటివి ఎన్నో చట్ట బద్ధంగానే అందుబాటులో ఉన్న నేపధ్యంలో ఒక సెక్స్ వర్కర్ కోసం దిగజారుడు తనంతో ఒక ఎన్ఆర్ఐ పాత్రను ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో క్రియేట్ చేసి అటు పూరి ఇటు సంపూ తమ మనోభావాలను గాయ పరిచారు అంటూ చాలామంది ఎన్ఆర్ఐ లు సంపూను టార్గెట్ చేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: